E-Paper
Advertisement

Sci-Fi Comedy Movie OTT : మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Sci-Fi Comedy Movie OTT : మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Sci-Fi Comedy Movie OTT : రోబోలు అందుబాటులోకి వస్తే, అవి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ‘రోబో’ సినిమాలో చూశాం మనం. ఇక ఇలాంటి సినిమాలన్నీ దాదాపుగా సీరియస్ యాక్షన్ తోనే నడుస్తాయి. కానీ దానికి కామెడీ యాడ్ చేసి, రోబోలు మనుషుల్నే బంధించే కథాంశంతో నడిచే మూవీని ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ మూవీ “బిగ్‌బగ్” (Bigbug) గురించి. 2022లో విడుదలైన ఈ సినిమాకు ‘అమెలీ’, ‘డెలికటెస్సెన్’, ‘సిటీ ఆఫ్ లాస్ట్ చిల్డ్రన్’ ఫేమ్ డైరెక్టర్ జీన్-పియర్ జూనెట్ (Jean-Pierre Jeunet) తెరకెక్కించారు. ఇందులో ఎల్సా జిల్బర్‌స్టీన్, ఇసాబెల్ నాంటీ, క్లాడ్ పెర్రాన్, స్టెఫాన్ డి గ్రూట్, యూసెఫ్ హజ్దీ, ఆల్బాన్ లెనోయిర్, ఫ్రాంకోయిస్ లెవంటల్, డొమినిక్ పినాన్, ఆండ్రే డుస్సోలియర్ తదితరులు నటించారు. 111 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సై-ఫై, కామెడీ థ్రిల్లర్ కు IMDbలో 5.5 రేటింగ్ ఉంది. Netflix ఒరిజినల్‌గా ఈ మూవీ 2022 ఫిబ్రవరి 11న రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  అమ్మాయిలకు నరకం చూపించే ఆ చోటు… ఆశ్రమంలో అవాక్కయ్యే స్టోరీలు… గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ

స్టోరీలోకి వెళ్తే…

2045 సంవత్సరంలో ఈ మూవీ స్టోరి ఉంటుంది. రెట్రో-ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో AI రోబోట్స్‌ తో ఇంటి, వంట పనులు చేయిస్తారు మనుషులు. ఆలిస్ (ఎల్సా జిల్బర్‌స్టీన్) అనే లేడీ పాత పుస్తకాలు, వస్తువులు కలెక్ట్ చేస్తుంది. ఆమె ఇంట్లో ప్రతీ పనికీ ఒక రోబోట్ ఉంటుంది. ఒక రోజు ఆలిస్ బాయ్‌ఫ్రెండ్ మాక్స్ ఇంటికి వస్తాడు. అదే టైమ్‌కు ఆమె ఎక్స్-హస్బెండ్ విక్టర్ కూడా తన యంగ్ సెక్రటరీ జెనిఫర్‌ తో ఊడిపడతాడు. నిజానికి ఆలిస్ ఇంట్లో ఉన్న రేర్ బుక్ కోసం అతను వస్తాడు. పొరుగున ఉండే ఆవిడ, ఆమె కుమారుడు లియో, ఆలిస్ కూతురు నినా కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవుతారు. ఇంట్లో అందరూ గొడవలు పడుతూ, ఒకరంటే ఒకరు జెలసీ చూపిస్తూ బిజీగా ఉంటారు. కానీ బయట ప్రపంచంలో అడ్వాన్స్‌డ్ ఆండ్రాయిడ్స్ మనుషులను కంట్రోల్ చేస్తాయి. మనుషులను అవమానించడానికి రియాలిటీ షో “Homo Ridiculus”ను కూడా నిర్వహిస్తాయి.

Advertisement

ఈ నేపథ్యంలోనే మనుషుల్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తాయి రోబోలు. అందులో భాగంగా ఆలిస్ ఇంట్లో ఉండే రోబోట్స్ డోర్స్ లాక్ చేసి అందర్నీ కిడ్నాప్ చేస్తాయి. కానీ అవి బయట Yonyx రివల్యూషన్ జరుగుతోంది. కాబట్టి మనుషులను “ప్రొటెక్ట్” చేయడానికే ఇలా చస్తున్నామని చెబుతాయి. నిజానికి రోబోట్స్ మనుషులు అవుట్‌ డేటెడ్ అని, వాళ్లను ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకుంటాయి. మరి రోబోలు నిజంగానే మనుషుల్ని చంపాయా ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరి.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×