E-Paper
Advertisement

iPhone 18 Pro, Air 2 Price Hike: ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ఎయిర్ 2 ధరలు ఇవే.. ఆపిల్ ఫ్యాన్స్‌పై బాంబు

iPhone 18 Pro, Air 2 Price Hike: ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ఎయిర్ 2 ధరలు ఇవే.. ఆపిల్ ఫ్యాన్స్‌పై బాంబు
Advertisement

iPhone 18 Pro, Air 2 Price Hike| 2026లో టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆపిల్ అభిమానుల తలపై బాంబు పడేలా ఉంది. ఈ కొత్త సిరీస్ లాంచ్ ధరలు ఆకాశనంటున్నాయి. 2026లో ఆపిల్ మెగా ఈవెంట్ లో భాగంగా సెకండ్ జెనరేషన్ ఐఫోన్ ఎయిర్ అంటే ఐఫోన్ ఎయిర్ 2 కూడా విడుదల కానుంది. రిపోర్ట్స్ ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ కంటే కొత్తగా వచ్చే 18 సిరీస్‌‌ ధరలు భారీ పెంపుతో రావొచ్చు. ప్రీమియం మోడల్స్‌లో గణనీయమైన ధర పెరుగుదల ఉండవచ్చు.

ప్రో మోడల్స్ ధరలు

ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం.. ఆపిల్ ధరలను 10 శాతం వరకు పెంచవచ్చు. ఈ పెరుగుదల ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌కు వర్తిస్తుంది. రాబోయే ఐఫోన్ ఎయిర్ 2 కూడా ఎక్కువ ధరతో లాంచ్ అవుతుంది. ఈ మోడల్స్‌ను ప్రీమియం అప్‌గ్రేడ్స్‌గా పొజిషన్ చేయవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ ప్రారంభ ధరలు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 వరకు ఉంటాయని అంచనా.

కొత్త చిప్‌సెట్ వల్ల పెరిగిన ఖర్చులు

Advertisement

ఆపిల్ కొత్త A20 బయోనిక్ చిప్‌సెట్ ఉపయోగించనుంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) ఈ ప్రాసెసర్‌ను తయారు చేస్తుంది. అడ్వాన్స్‌డ్ 2nm ప్రాసెసింగ్ టెక్నాలజీ తో ప్రాసెసర్ చిప్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ, అడ్వాన్స్ చిప్ కొరత వల్ల మాన్యుఫ్యాక్చరింగ్ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

భారీగా పెరిగిన చిప్ ఉత్పత్తి ఖర్చులు

తైవాన్ టెక్ రిపోర్ట్స్ ప్రకారం.. 2nm చిప్ ఉత్పత్తి చాలా ఖరీదైనది. ఈ ప్రాసెసర్ల ధర వల్లే మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఖర్చులు పెరగవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం.. కాంపోనెంట్ ఖర్చులు దాదాపు 87 శాతం పెరగవచ్చు. ఆపిల్ ధరల ప్లానింగ్ పై ఈ పెరిగిన ఖర్చుల ఒత్తిడి ఉంటుంది.

ఆపిల్ ప్రాఫిట్ మార్జిన్లు

Advertisement

ఆపిల్ సాధారణంగా తన ప్రాఫిట్ మార్జిన్లను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మార్జిన్లు తగ్గించకపోతే ధరలు పెరగవచ్చు. ఈ మార్పు ప్రధానంగా ప్రో మోడల్స్‌ను ప్రభావితం చేస్తుంది. స్టాండర్డ్ మోడల్స్‌లో పెద్ద ధర మార్పులు ఉండకపోవచ్చు.

స్టాండర్డ్ ఐఫోన్ 18 ధర అందుబాటులోనే

స్టాండర్డ్ ఐఫోన్ 18లో ధరలో స్వల్ప పెంపు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బేస్ మోడల్స్‌లో పాత జెనరేషన్ చిప్‌సెట్లు ఉపయోగించడం ఆపిల్ అలవాటు. ఇది ఉత్పత్తి ఖర్చులను నియంత్రిస్తుంది. గత ఏడాది ధరలనే కొనసాగించవచ్చు.

ఫోల్డబుల్ ఐఫోన్ కూడా 2026లోనే లాంచ్

ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా 2026లోనే తీసుకురావచ్చు. టెక్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ ప్రీమియం పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది. దీని ధర వివరాల గురించి ఇంతవరకు సమాచారం లేదు. అయితే ఈ డివైజ్ అల్ట్రా-ప్రీమియం బయ్యర్లను టార్గెట్ చేస్తుందని విశ్లేషకుల అంచనా.

శాంసంగ్ తో తీవ్ర పోటీ

శాంసంగ్ తన 2nm చిప్‌సెట్లకు TSMC కంటే తక్కువ ఛార్జ్ చేస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తేడా దాదాపు 33 శాతం ఉండవచ్చు. ఇది గెలాక్సీ S26 మోడల్స్‌ను మరింత పోటీ ధరల్లో అందుబాటులోకి తెస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఆపిల్ బలమైన పోటీ ఎదుర్కొనవచ్చు.

స్టోరేజ్ ఆప్షన్లు

ఐఫోన్ 17 సిరీస్‌ను 256GB బేస్ స్టోరేజ్‌తో లాంచ్ చేసింది ఆపిల్. 2026లో కూడా ఈ వ్యూహం కొనసాగవచ్చు. అన్ని ఐఫోన్ 18 మోడల్స్ 256GB నుంచి ప్రారంభమవచ్చు. ఇది ఆపిల్ ప్రీమియం పొజిషనింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: 2026లో ముందుగా లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు.. జనవరిలో ఒప్పో, పోకో, రియల్‌మీ విడుదలకు రెడీ

ధర పెరుగుదల రేంజ్

ఇండస్ట్రీ నిపుణులు 10 నుంచి 15 శాతం ధర పెరుగుదల అంచనా వేస్తున్నారు. ఇది ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ఎయిర్ 2కు వర్తించవచ్చు. కౌంటర్‌పాయింట్ వంటి మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్స్ ఈ అంచనాలకు మద్దతు ఇస్తున్నాయి. ఫైనల్ ధరలు ఆపిల్ మార్జిన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.

ఆపిల్ కస్టమర్లపై ఒత్తిడి

2026లో ప్రీమియం ఐఫోన్ల కోసం మరింత బడ్జెట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్ చిప్ టెక్నాలజీ వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. ఆపిల్ పర్‌ఫామెన్స్ మెరుగుదలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ధరల పెరుగుదల బట్టి ఆపిల్ మార్కెట్ వ్యూహం తెలుస్తుంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×