Social Drama OTT : రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని దారుణమైన ఘటనలు రీల్ లైఫ్ ద్వారా కళ్ళకు కట్టే సోషల్ డ్రామాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు మన మూవీ సజెషన్ లో అలాంటి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా గురించి చెప్పుకోబోతున్నాము. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘ది మాగ్డలీన్ సిస్టర్స్’ (The Magdalene Sisters). 2002లో విడుదలైన ఐరిష్ డ్రామా మూవీ. ఇది రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఐర్లాండ్ లో 1960లలో జరిగిన మాగ్డలీన్ లాండ్రీస్ అంటే కాన్వెంట్స్ లో మహిళలు ఎదుర్కొన్న బాధలను ఈ సినిమా ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు. పీటర్ ముల్లన్ రాసి, డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సమాజం మూర్ఖపు పోకడలు, మతం పేరుతో చేసే దారుణాలు, మహిళల హక్కుల గురించి ఉంటుంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించిన ఈ మూవీ, అదే రేంజ్ లో కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంది. సినిమాలో నన్స్, క్రిస్టియన్ మతం గురించి కూడా ఉండడంతో కాథలిక్ చర్చ్ విమర్శలు చేసింది.
ఐర్లాండ్, స్కాట్లాండ్ ఫిల్మ్ బోర్డ్స్ నిర్మించిన ఈ సినిమాలో జెరాల్డిన్ మెక్‌ఇవాన్ (మార్గరెట్), అన్నీ-మారీ డఫ్ (రోజ్), నోరా-జేన్ నూన్ (బెర్నాడెట్), డోరోతీ డఫీ (క్రిస్పినా), ఐలీన్ వాల్ష్ (ఫ్రాన్సెస్) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 59 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా 2002 ఆగస్ట్ లో రిలీజ్ అయ్యింది. భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు IMDbలో 7.7 రేటింగ్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం యాపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. హిస్టారికల్ డ్రామా ప్రియులకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.
Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా
కథ 1964లో ఐర్లాండ్ మాగ్డలీన్ లాండ్రీలో జరుగుతున్నట్టు చూపిస్తారు. కాథలిక్ చర్చ్ రన్ చేసే ఇన్‌స్టిట్యూట్ అది. పాపం చేశారని భావించే మహిళలను అక్కడికి పంపి, పాప విమోచనం కలిగిస్తారన్న మాట. అంటే వాళ్ళు పశ్చాత్తాప పడేలా పనికిమాలిన పనులన్నీ చేయించి టార్చర్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే మార్గరెట్ (జెరాల్డిన్ మెక్‌ఇవాన్) అనే రేప్ విక్టిమ్ అక్కడికి వస్తుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే… బాధితురాలు అయిన ఆ అమ్మాయినే పాపి అంటూ లాండ్రీకి పంపుతారు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చాక ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. రోజ్ (అన్నీ-మారీ డఫ్) అనే మదర్ ఆ పిల్లకి అబార్షన్ చేసి, ఆమెను ఒక రూమ్ లో పడేస్తారు.
మరోవైపు బెర్నాడెట్ (నోరా-జేన్ నూన్) అనే అనాథ అమ్మాయిని కూడా ఇదే లాండ్రీకి పంపుతారు. ఆమెను అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తోందని సిస్టర్స్ లాండ్రీకి పంపుతారు. క్రిస్పినా (డోరోతీ డఫీ) అనే మెంటల్ పిల్లాఉ కూడా అక్కడే లాక్ చేస్తారు. ఈ నలుగురు అమ్మాయిలు లాండ్రీలో స్ట్రిక్ట్ సిస్టర్ బ్రిడ్జెట్ (ఐలీన్ వాల్ష్) సూపర్ విజన్ కింద లేబర్ పనులు చేస్తారు. అంటే లాండ్రీ వర్క్ నుంచి మొదలు పెడితే… ప్రేయర్స్, పనిష్‌మెంట్స్ వంటివి అన్నమాట. సిస్టర్స్ ఆ అమ్మాయిలను మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా టార్చర్ పెడతారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిలు ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. మరి అనుకున్నట్టుగానే వాళ్ళు ఎస్కేప్ అయ్యారా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.