E-Paper
Advertisement

Sci -Fi Comedy Drama OTT : డ్రెస్ లో దూరే మస్కిటో… కట్ చేస్తే గుండె గల్లంతయ్యే ట్విస్ట్

Sci -Fi Comedy Drama OTT : డ్రెస్ లో దూరే మస్కిటో… కట్ చేస్తే గుండె గల్లంతయ్యే ట్విస్ట్
Advertisement

Sci -Fi Comedy Drama OTT : ‘ఘోస్ట్‌బస్టర్స్’ వంటి హిట్ చిత్రాలను తీసిన ఐవాన్ రైట్‌మన్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను 2001లో తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిరాశపరచినా, 2000వ దశకం ప్రారంభంలో వచ్చిన ఈ చిత్రంలో ఏలియన్ల కోసం వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, కామెడీ ఇష్టపడే వారికి మంచి వినోదాన్నయితే అందించింది. భూమి మీద ఒక ఉల్కాపాతంపై పరిశోధన చేస్తున్న సమయంలో, అందులో వేగంగా వృద్ధి చెందుతున్న గ్రహాంతర జీవులు ఉన్నాయని తెలుస్తుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ పేరు ‘ఎవల్యూషన్’ (Evolution). 2001లో విడుదలైన ఈ సినిమాకి ఇవాన్ రీట్మాన్ దర్శకత్వం వహించారు. ఇది డాన్ జాకోబీ కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో డేవిడ్ డుచోవ్నీ, ఓర్లాండో జోన్స్, సీన్ విలియం స్కాట్, జూలియన్నే మూర్, టెడ్ లెవిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ది మోంటెసిటో పిక్చర్ కంపెనీ నిర్మించింది. 2001జూన్ 8న యునైటెడ్ స్టేట్స్‌లో డ్రీమ్‌వర్క్స్ పిక్చర్స్, వరల్డ్ వైడ్ గా కొలంబియా పిక్చర్స్ విడుదల చేశాయి. ఇది బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది, $80 మిలియన్ల నిర్మాణ బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $98.4 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం Prime Videoలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : నిమిషానికో ట్విస్ట్… ఈ సిరీస్ ను చూశాక డాక్టర్లకు దండం పెడతారు… కే-డ్రామా లవర్స్ డోంట్ మిస్

స్టోరీలోకి వెళ్తే

అరిజోనా ఎడారిలో ఒక గ్రహశకలం వచ్చి పడుతుంది. ఆ శకలాలను పరిశోధిస్తున్నప్పుడు, అందులో వేగంగా పరిణామం చెందే ఏలియన్ జీవులు ఉన్నాయని ఇద్దరు కాలేజ్ ప్రొఫెసర్లు గుర్తిస్తారు. భూమిపై లక్షల ఏళ్లు పట్టే పరిణామ ప్రక్రియ, ఆ జీవులలో కేవలం గంటల వ్యవధిలోనే జరుగుతుంది. ఏకకణ జీవుల నుండి అవి క్రమంగా ప్రమాదకరమైన జంతువులుగా మారి ప్రపంచాన్ని ముంచెత్తే స్థాయికి చేరుకుంటాయి. ఇక అనుకున్నట్లే ఆ జీవులు పుట్టుకొస్తాయి. చివరకు ఈ శాస్త్రవేత్తల బృందం వినూత్నమైన పద్ధతిలో ఆ ఏలియన్లను ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా మిగిలిన కథ. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా థ్రిల్లర్ లా కాకుండా, సరదాగా సాగిపోతుంది. ఇక కామెడీ అభిమానులు దీని పై కూడా ఓ లుక్ వేయండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×