E-Paper
Advertisement

Mystery Thriller OTT : వరుస హత్యలతో వణుకు పుట్టించే సైకో… సస్పెన్స్ తో మెంటలెక్కించే మూవీ

Mystery Thriller OTT : వరుస హత్యలతో వణుకు పుట్టించే సైకో… సస్పెన్స్ తో మెంటలెక్కించే మూవీ
Advertisement

Mystery Thriller OTT : మమ్ముట్టి 1988లో మొదలు పెట్టిన ‘సిబిఐ’ సిరీస్ ఇప్పటికి ఐదు భాగాలుగా వచ్చింది. 2022 లో వచ్చిన ‘సిబిఐ 5: ది బ్రైన్’ చివరి సినిమా. అయితే ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం పనిచేసిన అదే దర్శకుడు, అదే రచయితతో ఈ సినిమా చేయడం ఒక రికార్డు. ఇందులో ఐకానిక్ క్యారెక్టర్ సేతురామ అయ్యర్ పాత్రలో మరోసారి మమ్ముట్టి కట్టిపడేశారు. సీరియల్ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీ నడుస్తుంది. సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏమిటి ? అనే వివారాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘సిబిఐ 5: ది బ్రైన్’ (CBI 5: The Brain) 2022లో వచ్చిన మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. స్వర్గచిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వర్గచిత్ర అప్పచ్చన్ నిర్మించిన ఈ సినిమాకు కె. మధు దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, ముఖేష్, సాయికుమార్, జగతి శ్రీకుమార్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 ఏప్రిల్ 6న విడుదల చేసి, సినిమాను 2022 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా ప్రస్తుతం Netflix లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

కథలోకి వెళ్తే

వరుసగా జరిగే కొన్ని హత్యల వెనుక ఏదో రహస్యం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. పోలీసులు దీని వెనుక ఎవరున్నారో కనిపపెట్టలేక పోతారు. ఈ కేసును విచారించడానికి రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న సీనియర్ సిబిఐ ఆఫీసర్ సేతురామ అయ్యర్ (మమ్ముట్టి) ని రంగంలోకి దించుతారు. ఈ కేసులో ఎక్కడా ఎలాంటి ఆధారాలు ఉండవు. దీనిని బాస్కెట్ కిలింగ్స్ అని పిలుస్తారు. అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేని మరణాలుగా కనిపిస్తాయి. కానీ వాటన్నింటి వెనుక ఒకే మాస్టర్ మైండ్ ఉంటుంది. ఇక అయ్యర్ తన టీం తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. స్టోరీ నడిచే కొద్దీ కథలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి నిందితుడు ఎవరు ? ఎందుకు వరుసగా హత్యలు చేస్తున్నాడు ? సేతురామ అయ్యర్ ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు ? అనే విషయాలను ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×