E-Paper
Advertisement

Sci-Fi Horror Thriller OTT : 200 మందిని బలి తీసుకున్న సైకో… సైన్స్ పాఠాలు నేర్పిస్తానని… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Sci-Fi Horror Thriller OTT : 200 మందిని బలి తీసుకున్న సైకో… సైన్స్ పాఠాలు నేర్పిస్తానని… గుండె ధైర్యం ఉంటేనే చూడండి
Advertisement

Sci-Fi Horror Thriller OTT : హర్రర్ సినిమాలంటేనే పిచ్చెక్కిపోయే జనాలు ఎంతోమంది ఉన్నారు. అవసరం అనుకుంటే భయపడుతూనే, దుప్పటి కప్పుకుని మరీ ఇలాంటి సినిమాలను చూస్తూ ఉంటారు. కానీ హర్రర్ లోనూ సైన్స్ ఫిక్షన్ జానర్ ను మిక్స్ చేసిన సినిమాలను ఎప్పుడైనా చూశారా ? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడండి. ఈరోజు మన మూవీ సజెషన్ అచ్చం ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో స్ట్రీమింగ్

2001లో విడుదలైన అమెరికన్ సై-ఫై హారర్ చిత్రం ‘జాసన్ ఎక్స్’ (Jason X). ఫ్రైడే ది 13th ఫ్రాంచైజీలో 10వ భాగంగా ఈ మూవీ వచ్చింది. జేమ్స్ ఐసాక్ ఈ మూవీకి దర్శకుడిగా పని చేశారు. కేన్ హోడర్ ఇందులో మెయిన్ లీడ్ గా నటించారు. జాసన్ వూర్హీస్ అనే మాస్క్డ్ కిల్లర్ గా నటించారు. రోవ్ లారెన్స్ అనే ఆర్మీ సైంటిస్ట్ గా లిసా రియాస్ నటించారు. చాడ్ లిండ్‌బర్గ్, లెస్లీ బిబ్, యూలిసెస్ గోమెజ్, మెలిస్సా బర్క్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 91 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2002 ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రిలీజ్ కాగా, మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. IMDbలో ఈ మూవీకి 4.7 రేటింగ్ మాత్రమే ఉంది. కానీ ‘ఫ్రైడే ది 13th’ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ కు మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఇక ఈ మూవీకి 14 మిలియన్ల బడ్జెట్ పెడితే, బాక్సాఫీస్ దగ్గర 17 మిలియన్ల వసూళ్లు కొల్లగొట్టింది.

Advertisement

Read Also :  లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్… ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ హీరో కామెడీ హీస్ట్ డ్రామా

స్టోరీలోకి వెళ్తే…

ఈ మూవీ స్టోరీ 2008లో స్టార్ట్ అవుతుంది. ఐరన్ మాస్క్‌ తో ఉన్న జాసన్ వూర్హీస్ (కేన్ హోడర్)ను పట్టుకుంటారు. అతన్ని క్రియోజెనిక్ ల్యాబ్‌ లో ఫ్రీజ్ చేస్తారు. ఆ తరువాత 445 ఏళ్లకి (2455లో) వెళ్లిపోతారు. భవిష్యత్ ఆర్మీ గ్రూప్ జాసన్ బాడీని కనిపెట్టి, స్పేస్ ‌షిప్‌ కు తీసుకెళ్తుంది. రోవ్ లారెన్స్ (లిసా రియాస్) అనే సైంటిస్ట్ జాసన్ ‌ను తిరిగి రప్పించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఫలించి, అతను రాక్షసుడిగా మేల్కొంటాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. జాసన్ స్పేస్‌ షిప్‌ లోని క్రూ మెంబర్స్ ను ఒక్కొక్కరుగా చంపడం స్టార్ట్ చేస్తాడు. తలలు నరికేయడం వంటి భయంకరమైన మర్డర్స్ చేస్తాడు.

Advertisement

క్రూ మెంబర్స్ జాసన్ వేట నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే స్పేస్‌ షిప్ డామేజ్ అవుతుంది. దీంతో నెమ్మదిగా అందులో ఆక్సిజన్ తక్కువ అవుతూ ఉంటుంది. జాసన్ కు మాత్రం దీనివల్ల ఎలాంటి సమస్యా ఉండదు. పరిస్థితి ఎలా ఉన్నా అతను సర్వైవ్ అవుతాడు. రోవ్, డిటెక్టివ్ జాంగ్-హూన్ జాసన్‌ ను ఎలాగైనా ఆపడానికి ప్లాన్ చేస్తారు.కానీ జాసన్ సూపర్‌ హ్యూమన్ గా మారి ఊహించనంత పవర్ తో ఒక్కొక్కరిని ఊచకోత కోస్తూ వెళతాడు. మరి అతన్ని ఎలా అడ్డుకున్నారు ? చివరికి ఆ స్పేస్ షిప్ లో మిగిలింది ఎవరు ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×