E-Paper
Advertisement

Bank of Bhagyalakshmi OTT : లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్… ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ హీరో కామెడీ హీస్ట్ డ్రామా

Bank of Bhagyalakshmi OTT : లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్… ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ హీరో కామెడీ హీస్ట్ డ్రామా
Advertisement

Bank of Bhagyalakshmi OTT : ఓటీటీలో ప్రతీవారం ఏదో ఒక కొత్త సినిమా వస్తుంది. అయితే ముందుగానే ఆయా సినిమాలను రిలీజ్ చేయబోతున్నాము అంటూ అప్డేట్ ఇచ్చి, ప్రేక్షకులను అలర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మరో కొత్త మూవీ కూడా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోందని వెల్లడించారు మేకర్స్. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025 డిసెంబర్ చివరలో ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ (Bank of Bhagyalakshmi) అనే మూవీ విడుదలైంది. ఈ కామెడీ హీస్ట్ డ్రామాకు అభిషేక్ మంజునాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. 2024లో విడుదలైన ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘బ్లింక్’ తర్వాత కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటించిన సినిమా ఇది. దీక్షిత్ శెట్టి అంటే తెలియని ప్రేక్షకులకు రష్మిక మందన్న నటించిన రీసెంట్ తెలుగు చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో హీరో అంటే బాగా గుర్తుపడతారు. విక్రమ్ పాత్రతో టాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు అందుకున్న కొద్దికాలానికే దీక్షిత్ నటించిన ఈ సినిమా విడుదలైంది. దీక్షిత్ శెట్టి ప్రముఖ టీవీ సీరియల్ ‘నాగిని’లో నటించారు. ఆ తర్వాత 2020లో వచ్చిన ‘దియా’తో గుర్తింపు పొందారు.

Advertisement

‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం అవ్వడంతో, మూవీ రిలీజ్ కూడా లేట్ అయ్యింది. ఏదైతేనేం 2025లో తెరపైకి వచ్చిన ఈ మూవీ 2026 జనవరి 12న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి రాబోతోంది. ఈ చిత్రంలో అశ్విన్ రావు పల్లకి, భరత్ జిబి, శ్రీవత్స, గోపాలకృష్ణ దేశ్‌పాండే, బృందా ఆచార్య, విశ్వనాథ్ మండలిక తదితరులు నటించారు.

Read Also : కన్న తండ్రినే చంపాలనుకునే కొడుకు… ఊహించని ట్విస్టులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

కథలోకి వెళ్తే…

Advertisement

ఇందులో దీక్షిత్ చిన్న దొంగల ముఠాకు నాయకుడిగా కన్పిస్తాడు. అయితే లైఫ్ లాంగ్ సెట్ అయ్యేలా ఒక రాబరీకి ప్లాన్ చేస్తారు. ఓ బ్యాంకును దోచుకుని, మిగిలిన లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అందులో భాగంగా ఒక స్థానిక బ్యాంక్ దోపిడీకి స్కెచ్ వేస్తారు. ఇదే తమ లైఫ్ లో చిట్టచివరి దొంగతనం కావాలని అనుకుంటారు. కానీ తీరా దొంగతనం చేసే రోజు రాగానే ఊహించని షాక్ తగులుతుంది. బ్యాంకుకు వెళ్ళాక బాగా డిసప్పాయింట్ అవుతుంది ఈ దొంగల ముఠా. ఎందుకంటే ఆ బ్యాంక్ ఖజానాలో కేవలం రూ. 67,000 మాత్రమే ఉందని, మిగిలిన డబ్బును ATMలకు పంపిణీ చేశారని తెలుసుకుంటారు. అసలు దొంగతనమే చేయకముందే ఆ టీంను పోలీసులు చుట్టుముడతారు. ఇప్పుడు కథ మలుపు తిరుగుతుంది. ఎలాగైనా సరే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు. ఆ ప్లాన్ ను అమలు చేశాక వాళ్ళు కల్లో కూడా ఊహించనంత డబ్బును చూస్తారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి ? వాళ్ళకు డబ్బు ఎలా దొరికింది ? అనేది తెరపై చూడాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×