E-Paper
Advertisement

OnePlus Turbo 6: ఐఫోన్ 17 కంటే పవర్‌ఫుల్ ఫోన్స్ లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఇక ఛార్జ్ చేయడం మర్చిపోండి

OnePlus Turbo 6: ఐఫోన్ 17 కంటే పవర్‌ఫుల్ ఫోన్స్ లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఇక ఛార్జ్ చేయడం మర్చిపోండి

OnePlus Turbo 6| పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ చైనాలో రెండు పవర్‌ఫుల్ కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసింది. ఈ ఫోన్లు వన్‌ప్లస్ టర్బో 6, వన్‌ప్లస్ టర్బో 6v మోడల్స్. రెండు ఫోన్లలోనూ 9000mAh కెపాసిటీగల అతి పెద్ద బ్యాటరీ ఉంది. ఇది ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో చాలా అరుదు. వన్‌ప్లస్ ప్రకారం.. ఈ ఫోన్లతో తరుచూ ఛార్జింగ్ చేసే సమస్య ఉండదు. రోజువారీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాటరీ కెపాసిటీ ఐఫోన్ 17 మోడల్స్ కంటే దాదాపు రెట్టింపు. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో 3,149mAh నుంచి 4,252mAh కెపాసిటీ బ్యాటరీలు ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. గరిష్టంగా ఐఫోన్ 17 ప్రో వేరియంట్‌లో 4,252mAh బ్యాటరీ ఉంది.

వివిధ యూజర్ల కోసం పవర్‌ఫుల్ ప్రాసెసర్లు

వన్‌ప్లస్ టర్బో 6లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్‌ఫామెన్స్, హెవీ మల్టీటాస్కింగ్ యూజర్లకు ఉద్దేశించబడింది. టర్బో 6vలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌ బలమైన పర్‌ఫామెన్స్‌తో పాటు మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ అందిస్తుంది. రెండు ఫోన్లు స్మూత్ గేమింగ్, ఫాస్ట్ యాప్ లాంచ్‌లు, స్టేబుల్ రోజువారీ పవర్‌ఫామెన్స్ ఇస్తాయి. వన్‌ప్లస్ టర్బో 6 ఫోన్లు.. పవర్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాల్సిన యూజర్లకు పొజిషన్ చేసింది.

బెస్ట్ సెక్యూరిటీ రేటింగ్స్‌ స్ట్రాంగ్ డ్యూరేషన్

టర్బో 6 సిరీస్ గొప్ప మన్నిక సర్టిఫికేషన్లు కలిగి ఉంది. రెండు మోడల్స్ IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ రేటింగ్స్ తో ఫోన్ దుమ్ము, నీటిలో మునిగినా హై-ప్రెషర్ స్ప్రేల నుంచి రక్షణ ఇస్తాయి. రఫ్ యూసేజ్, అవుట్‌డోర్ పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ సాఫీగా రన్ అవుతుంది.

వన్‌ప్లస్ టర్బో 6 ధర, కలర్ ఆప్షన్లు

వన్‌ప్లస్ టర్బో 6 బేస్ మోడల్ ప్రారంభ ధర 2,099 యువాన్‌లు. అంటే భారత కరెన్సీలో ధర రూ.27,000. ఈ మోడల్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉంది. టాప్ వేరియంట్ 2,899 యువాన్‌లు, సుమారు రూ.37,000. టర్బో 6 సిల్వర్, బ్లాక్, గ్రీన్ కలర్లలో లభిస్తుంది.

వన్‌ప్లస్ టర్బో 6v ధర వివరాలు

వన్‌ప్లస్ టర్బో 6v 1,699 యువాన్‌ల నుంచి ప్రారంభమవుతుంది. ఇది సుమారు రూ.21,000. ఈ వేరియంట్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉంది. టర్బో 6v బ్లూ, బ్లాక్ వైట్ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ధర మిడ్-రేంజ్ యూజర్లకు ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ కావాల్సినవారికి టార్గెట్ చేసింది.

డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

రెండు స్మార్ట్‌ఫోన్లలో 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ రిచ్ కలర్స్, డీప్ కాంట్రాస్ట్ అందిస్తుంది. వీడియోలు చూడడం, గేమింగ్ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. వన్‌ప్లస్ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ స్మూత్ యానిమేషన్స్, మెరుగైన ప్రైవసీ కంట్రోల్స్ అందిస్తుంది.

కెమెరా సెటప్, బ్యాటరీ ఛార్జింగ్

రెండు ఫోన్లలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. డెప్త్ సహాయం కోసం 2MP సెకండరీ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. రెండు డివైస్‌లు 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. పెద్ద 9000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ త్వరగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువ స్క్రీన్ టైమ్, తక్కువ ఛార్జింగ్ బ్రేక్స్ ఆశించవచ్చు.

అదనపు ఫీచర్లు, కనెక్టివిటీ

టర్బో 6 సిరీస్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు లౌడ్, బ్యాలెన్స్‌డ్ ఆడియో అందిస్తాయి. రెండు ఫోన్లు ఛార్జింగ్, డేటా కోసం USB టైప్-సీ పోర్ట్ ఉపయోగిస్తాయి.

వన్‌ప్లస్ టర్బో 6, టర్బో 6v భారీ బ్యాటరీ పర్‌ఫామెన్స్‌ ప్రధాన్యంగా రూపొందాయి. బలమైన ప్రాసెసర్లు, డ్యూరెబుల్ డిజైన్, ఆధునిక సాఫ్ట్‌వేర్ కూడా అందిస్తాయి. రఫ్ యూజ్ చేసేవారికి, తరచూ ఛార్జింగ్ ఇష్టం లేని యూజర్లకు ఈ ఫోన్లు సరిపోతాయి.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×