E-Paper
Advertisement

Sci-Fi Thriller OTT : మెదడును హ్యాక్ చేసే మెంటల్ గాళ్ళు… మైండ్ బెండయ్యే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Sci-Fi Thriller OTT : మెదడును హ్యాక్ చేసే మెంటల్ గాళ్ళు… మైండ్ బెండయ్యే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Sci-Fi Thriller OTT : అబ్బుర పరిచే సీన్స్ తో, మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే సినిమాలే సై- థ్రిల్లర్ మూవీస్. ఒక్కసారి ఆ ఊహకందని ఫ్యాంటసీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తే సినిమా అయిపోయేదాకా టైమ్ కూడా తెలియదు. కాకపోతే సైన్స్ కు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మాత్రం బుర్రకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆ కొంచం శ్రమను తీసుకోగలిగితే… సినిమా ప్రపంచంలో సైన్స్ ఫిక్షన్ కు మించిన జానర్ ఉండదు. ఇక ఈ జానర్లో సినిమా అంటే పిచ్చిగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

లేటెస్ట్ గా విడుదలైన అమెరికన్ సై-ఫై స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ ‘ది కోపెన్‌హాగన్ టెస్ట్’ (The Copenhagen Test). ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈ షో క్రియేటర్ అండ్ షోరన్నర్ థామస్ బ్రాండన్. సిము లియు (అలెగ్జాండర్ హేల్ – ఇంటెలిజెన్స్ అనలిస్ట్), మెలిస్సా బర్రెరా (మిషెల్ – లవ్ ఇంటరెస్ట్ & హ్యాండ్లర్), సాల్ రూబినెక్, బ్రియాన్ డి’ఆర్సీ జేమ్స్, సిన్‌క్లెయిర్ డానియల్, కాథ్లీన్ చాల్ఫాంట్ ఈ సై-ఫై స్పై థ్రిల్లర్ లో ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 27న Peacockలో మొదటి సీజన్ రిలీజ్ అయింది. IMDbలో 6.5 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also :  మట్టిలో ఎముకల గూళ్ళు… ఈ డెడ్లీ మర్డర్ మేజ్లో అడుగు పెడితే అంతే సంగతులు

స్టోరీలోకి వెళ్తే…

కథ ఫ్యూచర్‌ లో సాగుతుంది. ఫస్ట్ జనరేషన్ చైనీస్-అమెరికన్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అలెగ్జాండర్ హేల్ (సిము లియు). అతను “ది ఆర్ఫనేజ్” అనే సీక్రెట్ స్పై ఏజెన్సీలో పని చేస్తాడు. CIA, FBI లాంటి టాప్ సెక్యూరిటీ ఏజెన్సీలను మానిటర్ చేసే వాచ్‌ డాగ్ ఆర్గనైజేషన్ ఇది. ఒక రోజు అలెగ్జాండర్ తన బ్రెయిన్ హ్యాక్ అయినట్టు తెలుసుకుంటాడు. ఎవరో అతని కళ్లు, చెవుల ద్వారా అతను చూసేది, వినేది… ఇలా ప్రతీ ఒక్కటీ రియల్ టైమ్‌లో యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే లివింగ్ సర్వైలెన్స్ కెమెరాలాగా అన్నమాట.

విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ హ్యాక్ గురించి తెలిసినా, తెలియనట్టే నటిస్తాడు. హ్యాకర్స్‌ ను ట్రాప్ చేయడానికి ఏజెన్సీతో కలిసి పని చేస్తాడు. ఏజెన్సీ “ది ఆర్ఫనేజ్” అతని చుట్టూ ఫేక్ వరల్డ్ బిల్డ్ చేస్తుంది. కొత్త గర్ల్‌ఫ్రెండ్ గా మిషెల్ (మెలిస్సా బర్రెరా)ను అసైన్ చేస్తుంది. ప్రమోషన్ ఇస్తుంది, డేంజరస్ మిషన్‌ లో పెడుతుంది. మరోవైపు ఇదంతా చూశాక అలెగ్జాండర్ కు ఎవర్ని నమ్మాలో, తన లైఫ్‌లో ఏది రియల్ అనేది అస్సలు అర్థం కాదు. అసలు అతని బ్రెయిన్ హ్యాక్ ఎలా జరిగింది? కోపెన్‌హాగన్ టెస్ట్ అనే లాయల్టీ టెస్ట్ తో దీనికి సంబంధం ఏంటి? అసలు హీరో ఎవర్ని నమ్మాలి? అనే ప్రశ్న చుట్టూ తిరిగే మైండ్-బెండింగ్ స్పై-ఫై థ్రిల్లర్ ఇది. సై-ఫై మాత్రమే కాదు స్పై థ్రిల్లర్ ప్రియులకు మంచి ఛాయిస్. కాకపోతే డిస్టర్బింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి జాగ్రత్త.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×