Quantum Energy Scooters 2026: క్వాంటం ఎనర్జీ స్కూటర్లను ఇండియాలో క్వాంటం ఎనర్జీ (Quantum Energy) అనే కంపెనీ తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 2025 వరకు పలు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..
⦿ Quantum Milan: ఈ స్కూటర్ ధర రూ. 89,000 ఉంటుంది. దీని రేంట్ 80-100 కి.మీ ఉంటుంది. హై-స్పీడ్ మోడల్. టాప్ స్పీడ్ 60 kmph ఉంటుంది.
⦿ Quantum Plasma (బేస్, XR): దీని ధర రూ. 89,000 – 1,09,000 ఉంటుంది. 100 -120 కి.మీ. రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 60-65 kmph. దీనిలో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి.
⦿ Quantum Bziness: దీని ధర రూ. 96,000 – 1,20,000 వరకు ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 110-135 కి.మీ. రేంజ్ లభిస్తుంది. కమర్షియల్, లాస్ట్ మైల్ డెలివరీకి అనుకూలంగా ఉంటుంది.
⦿Quantum Elektron: దీని ధర రూ. 91,000 ఉంటుంది. 100 కి.మీ రేంజ్ లభిస్తుంది. మోడర్న్ డిజైన్ ను కలిగి ఉంటుంది. టాప్ స్పీడ్ 60 kmph.
ఈ ధరలు ఎక్స్-షోరూమ్ లో మాత్రమే. ఆన్ రోడ్ ధరలు (RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలతో) రాష్ట్రంతో పాటు నగరాన్ని బట్టి మారుతుంటాయి. సుమారు రూ. 5,000-15,000 అదనంగా ఉండవచ్చు. కొన్ని మోడల్స్ కు సబ్సిడీలు, ముఖ్యంగా FAME-II, స్టేట్ సబ్సిడీలు అందుబాటులో ఉంటే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
క్వాంటం ఎనర్జీ సంస్థ హైదరాబాద్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ. 2020-2021లో స్థాపించబడింది. కుసలవ గ్రూప్ బ్యాకింగ్ తో నడుస్తోంది. R&D సెంటర్ బెంగళూరులో, మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్‌ను పెంచడం, కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం, సస్టైనబుల్ మొబిలిటీని ప్రోత్సహించడం. ఈ కంపెనీ స్కూటర్లు జీరో ఎమిషన్స్, లో కార్బన్ ఫుట్ ప్రింట్, రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి. డైలీ కమ్యూటింగ్, లాస్ట్ మైల్ డెలివరీకి అనుకూలం. ఈ స్కూటర్లు అఫోర్డబుల్, పవర్ ఫుల్, ఎకో ఫ్రెండ్లీగా పాపులర్ అవుతున్నాయి.
Read Also: రెట్రో లుక్, సూపర్ రేంజ్.. యూత్ ను కట్టిపడేస్తున్న చేతక్ స్కూటర్!
క్వాంటం ఎనర్జీ సంస్థ ఇప్పటి వరకు 10,000 పైగా వెహికల్స్ అమ్మకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 60+ షోరూమ్స్ ఉన్నాయి. 2026లో మరిన్ని మోడల్స్, ఇంకా స్టైలిష్ గా, ఎక్కువ రేంజ్ తో తీసుకు రావాలని కంపెనీ భావిస్తోంది. ఈ స్కూటర్లకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ లభిస్తోంది.
Read Also: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్, ఒక్క ఛార్జ్ తో 242 కి.మీ రేంజ్!