E-Paper
Advertisement

Sci-Fi Thriller OTT : చూస్తుండగానే ఆకాశం నుంచి ఊడిపడే మేఘాలు… గుండె జారిపోయే సీన్లు సామీ

Sci-Fi Thriller OTT : చూస్తుండగానే ఆకాశం నుంచి ఊడిపడే మేఘాలు… గుండె జారిపోయే సీన్లు సామీ
Advertisement

Sci-Fi Thriller OTT : మనల్ని ఊహా ప్రపంచంలో విహరించేలా చేసే విజువల్ వండర్స్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు. ఓవైపు సైన్స్ ను చూపిస్తూనే, మరోవైపు దానికి ఫాంటసీ టచ్ ఇచ్చి బుర్ర బద్దలయ్యే రేంజ్ స్టోరీలతో ఆకట్టుకోవడంలో హాలీవుడ్ మేకర్స్ ది అందెవేసిన చెయ్యి. మీకు ఇలాంటి సినిమాలంటే ఇష్టమా ? మరెందుకు ఆలస్యం… ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకునే మూవీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2019లో విడుదలైన ఫ్రెంచ్ ఒరిజినల్ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది లాస్ట్ వేవ్’ (The Last Wave). దర్శక ద్వయం ఎమిలీ డెలాపోర్ట్ – జాక్ ఆడియార్డ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్‌ తో ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ప్రతి ఎపిసోడ్ సుమారు 45–55 నిమిషాలు ఉంటుంది. ఈ సిరీస్ ఫ్రెంచ్ టెలివిజన్‌ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్‌ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆంటోనియా బోర్డే అనే ఇన్వెస్టిగేటర్ గా ఇసాబెల్ల నటించింది. పోలీస్ ఆఫీసర్ గా శాంటి ఆమరా, ఆంటోనియా కుమారుడు జూలియన్ బోర్డేగా జువాన్ లిమోసిన్, యంగ్ రిపోర్టర్ ఎవాగా ఎమిలీ డె బ్రెయిన్, ఆంటోనియా హస్బండ్ గా ఫ్రాంక్ డ్యూబోస్క్ నటించారు.

Advertisement

Read Also : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ మర్డర్ కేసు… ఎక్కడ చూడవచ్చో తెలుసా ?

స్టోరీలోకి వెళ్తే…

ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో సిరీస్ అంతా సాగుతుంది. ఇక్కడ ఒకరోజు రాత్రి సడన్ గా భారీ తుఫాను ఏర్పడుతుంది. తుఫానుకు ముందు తరువాత సైలెన్స్ అన్నది కామన్. కానీ ఇక్కడ మాత్రం తుఫాన్ తగ్గిన తరువాత అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. సముద్రం నుండి ఒక అసాధారణమైన శక్తి వచ్చి, అక్కడి జనాలపై ఎఫెక్ట్  చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు సడన్ గా మాయం అవుతారు. వాళ్లు వేసుకున్న బట్టలు మాత్రం అక్కడే పడి ఉంటాయి. మరికొంత మందికి సూపర్ పవర్స్ వస్తాయి. అలాగే చాలామంది గతాన్ని మర్చిపోతారు.

Advertisement

ఒక సీనియర్ పోలీస్ ఇన్వెస్టిగేటర్ ఫ్యామిలీ కూడా ఈ మిస్టీరియస్ సిట్యుయేషన్ లో చిక్కుకుంటుంది. ఆమె కొడుకు జూలియన్ సడన్‌ గా మారిపోతాడు. అదే సమయంలో రిపోర్టర్ ఎవా ఈ మిస్టరీ ఏంటో కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. అసలు ఈ మిస్టీరియస్ వేవ్ ఏంటి ? ఇది సైంటిఫిక్ ఫెనామెనానా లేక సూపర్‌ నాచురల్ శక్తా ? ఈ గ్రామంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి ? దీనివల్ల అక్కడి ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×