E-Paper
Advertisement

Sci – Fi Thriller OTT : కంటికి కనిపించని అడ్డుగోడతో అడ్డంగా బుక్కయ్యే ఒంటరి అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ ఖరాబ్ ట్విస్ట్

Sci – Fi Thriller OTT : కంటికి కనిపించని అడ్డుగోడతో అడ్డంగా బుక్కయ్యే ఒంటరి అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ ఖరాబ్ ట్విస్ట్
Advertisement

Sci – Fi Thriller OTT : ఓటీటీలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వస్తుంటాయి. ఇవి ఆడియన్స్ ని ఆలోచనల్లో పడేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఒక మనిషి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలడు అనే అంశాన్ని ఈ సినిమా ఆసక్తిగా చూపిస్తుంది. ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాల అందాలు కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ సినిమాలో అంతా దాదాపు ఒక్కరే కనిపిస్తారు. నటి మార్టినా గెడెక్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2012లో విడుదలైన ఈ ఆస్ట్రియన్-జర్మన్ డ్రామా మూవీ పేరు ‘ది వాల్’ (The Wall). దీనికి జూలియన్ పోల్స్లర్ దర్శకత్వం వహించగా, మార్టినా గెడెక్ లీడ్ రోల్ లో నటించింది. ఆస్ట్రియన్ రచయిత మార్లెన్ హౌషోఫర్ రాసిన 1963 నవల ‘డై వాండ్’ ఆధారంగా ఇది రూపొందింది. ఈ చిత్రం 86వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్ట్రియన్ ఎంట్రీగా ఎంపికైంది. కానీ అది నామినేట్ కాలేదు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా స్లోగా సాగినా, ప్రేక్షకులు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆల్ప్స్ పర్వతాల అందాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. స్టోరీ కూడా ఇంటెన్స్ గా ఉంటుంది.

Advertisement

Read Also : సడన్ గా మిస్సయ్యే భార్య… కల్లోనే భర్తకు దారి చూపే ఆధారాలు… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

కథ ఏమిటంటే

ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన స్నేహితులతో కలిసి ఆస్ట్రియన్ పర్వత ప్రాంతంలోని ఒక బంగళాకు వెళ్తుంది. అక్కడ విశ్రాంతి తీసుకుని ఆమె నిద్రలేచి చూసేసరికి, తన చుట్టూ కంటికి కనిపించని ఒక అడ్డు గోడ ఏర్పడుతుంది. స్నేహితులు వేటకు వెళ్లిపోతారు. దీంతో ఆమె బయట ప్రపంచంతో కాంటాక్ట్ కోల్పోతుంది. ఆ గోడకు అవతలి వైపు ఉన్న జీవం స్తంభించిపోయినట్లు కనిపిస్తుంది. ఒక కుక్క , ఒక ఆవు, ఒక పిల్లితో కలిసి ఆమె అక్కడ  ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. అక్కడ ఆమె ఎలా బ్రతికింది? ఆహారం కోసం ఆమె చేసిన పోరాటం ఏమిటి? ఇంతకీ ఆ అడ్డు గోడ ఎలా వచ్చింది ? దీని నుంచి ఆమె బయట పడిందా ? అనేదే ఈ సినిమా మిగిలిన కథ.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×