Bangladesh Minister: ఇండియా ( India) అలాగే బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య దూరం పెరిగిపోయింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 ప్రసారాలపై బ్యాన్ వేయడమే కాకుండా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board ) సంచలన ప్రకటన చేసింది. దీంతో ఇండియాకు బంగ్లాదేశ్ జట్టు రావడం పై సందిగ్ధత నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియాలో బంగ్లాదేశ్ పర్యటించడంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్ ( Bangladesh Sports Ministry Asif Nazrul ) కీలక ప్రకటన చేశారు. తమ బంగ్లాదేశ్ జట్టును వెనకేసుకు వస్తూ, ఇండియాలో పర్యటించబోమని మరోసారి తేల్చి చెప్పారు క్రీడా శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్. టి20 ప్రపంచ కప్ ఆడడానికి బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగానే ఉంది… కానీ ఇండియాలో మాత్రం పర్యటించబోమని వెల్లడించారు. శ్రీలంక, దుబాయ్, లేదా చివరకు పాకిస్తాన్ గడ్డపైన టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) మ్యాచ్ లు ఆడతామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆసిఫ్ నజ్రుల్ వెల్లడించారు. కానీ ఇండియాలో మాత్రం పర్యటించబోం… సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలోని ఏ ఒక్క నగరంలో కూడా తాము ఆడబోమని వెల్లడించారు ఆసిఫ్ నజ్రుల్.
తమ కోసం బీసీసీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలోని ఇతర వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ స్కెచ్ లు వేస్తోంది.. కానీ మేం అస్సలు ఇండియాలో పర్యటించబోమన్నారు బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఆసిఫ్ నజ్రుల్ (Ministry Asif Nazrul ). కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ( Bangladesh Cricket Board ) రాసిన లేఖపై ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) స్పందించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అడిగినట్లుగా వేదికలు మార్చడం అస్సలు కుదరబోదని పేర్కొంంది ఐసీసీ. ఆడితే ఆడండి, లేకపోతే పాయింట్స్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇండియాలో పర్యటిస్తే, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఐసీసీ తెలిపింది. ఎలాంటి హాని జరుగకుండా బంగ్లాదేశ్ టీమ్ ను సెఫ్టీగా ఉంచుతామని స్పష్టం చేసింది.
Asif Nazrul Bangladesh Sports Ministry 🗣️
"Bangladesh is ready to play the T20 World Cup in Sri Lanka, UAE, or even Pakistan, but not in any Indian city."
– BCCI is willing to shift Bangladesh matches to different venues, but BCB is not ready to play 😲pic.twitter.com/pBFuoFEUUX
— Richard Kettleborough (@RichKettle07) January 13, 2026