E-Paper
Advertisement

Romantic Movie OTT : కొరియా వీధుల్లో థాయ్ జంట… పేరు తెలీకుండానే ప్రేమలో… ప్రేమికులు చూడాల్సిన మూవీ

Romantic Movie OTT : కొరియా వీధుల్లో థాయ్ జంట… పేరు తెలీకుండానే ప్రేమలో… ప్రేమికులు చూడాల్సిన మూవీ
Advertisement

Romantic Movie OTT : ఈ సినిమా థాయ్‌లాండ్‌లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలోని అందమైన ప్రదేశాలను ఇందులో చాలా చక్కగా చూపించారు. దాదాపు 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్నేషనల్‌గా కూడా పాపులర్ అయింది ఈ సినిమా.  ఇది ఇద్దరు అపరిచితుల మధ్య జరిగే జర్నీని సరదాగా చూపిస్తుంది. ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చో అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ థాయ్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘హలో స్ట్రేంజర్’ (Hello Stranger). దీనికి బంజాంగ్ పిసంతనకున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2010 ఆగస్ట్ 19న థాయ్‌లాండ్‌లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద 130 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసి, సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో చంటవిట్ ధనసేవి, న్యుంగ్తిదా సోఫాన్ నటించారు. దీనికి ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ఉంది. ఇది ఆపిల్ టీవీ (Apple tv) నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ లో అందుబాటులో ఉంది ఈ సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కొరియా టూర్‌కి వెళ్ళిన ఒక అబ్బాయి, తన టూర్ బస్సు మిస్ అయిపోయి రోడ్డు మీద దిక్కులు చూస్తూ ఉంటాడు. అదే టైంలో సోలో ట్రిప్ వేస్తున్న ఒక అమ్మాయి అతనికి పరిచయమవుతుంది. వీళ్ళిద్దరూ అప్పటికప్పుడు ఒక క్రేజీ డెసిషన్ తీసుకుంటారు. అసలు పేర్లు గానీ, పర్సనల్ డీటెయిల్స్ గానీ అడగకుండా కేవలం స్ట్రేంజర్స్ గా కలిసి తిరగాలని ఫిక్స్ అవుతారు. ఆ పర్యటనలో కొరియాలోని అందమైన ప్రదేశాలు చూస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ, ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు.

కానీ ఇలా పరిచయం లేని వ్యక్తితో ఉండటం వల్ల, వాళ్ళు తమ మనసులోని బాధలను, బ్రేకప్ కథలను ఒకరితో ఒకరు ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు. ఇక ట్రిప్ చివర్లో వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ ఒకరి పేర్లు ఒకరికి తెలియవు. ట్రిప్ అయిపోయాక మళ్ళీ ఒకరినొకరు కలవడానికి ఎటువంటి కాంటాక్ట్ వివరాలు ఉండవు. సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అసలు కలిశారా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనేది ఈ థాయ్ రొమాంటిక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : రోడ్డున పడే బతుకులు… మనీ కోసం మాస్టర్ స్కెచ్ … క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×