E-Paper
Advertisement

Science Fiction Movie OTT : ప్రేమలో పడే రోబో… బాయ్ ఫ్రెండ్ కలిశాకే అసలు కథ…ఉక్కిరిబిక్కిరి చేసే సీన్స్

Science Fiction Movie OTT : ప్రేమలో పడే రోబో… బాయ్ ఫ్రెండ్ కలిశాకే అసలు కథ…ఉక్కిరిబిక్కిరి చేసే సీన్స్
Advertisement

Science Fiction Movie OTT : కొన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ సినిమాలు బుర్రని గిర్రున తిరిగేలా చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా బీభత్సమైన కంటెంట్ తో వచ్చింది. ఒక రోబో తన యాజీమానిపై తిరగబడితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. క్లైమాక్స్ వరకు ఇది చూపు తిప్పుకోనివ్వదు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కంపానియన్’ (Companion). దీనికి డ్రూ హాంకాక్ తొలి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీనిని జాక్ క్రెగ్గర్, రాయ్ లీ, రాఫెల్ మార్గుల్స్ నిర్మించారు. ఇందులో సోఫీ థాచర్, జాక్ క్వాయిడ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 జనవరి 31న యునైటెడ్ స్టేట్స్‌లో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ విడుదల చేసింది. $10 మిలియన్ల బడ్జెట్‌తో $36.7 మిలియన్లు వసూలు చేసింది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18 నుండి HBO Max, Jio hotstar లో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జోష్ అనే ఒక సంపన్న వ్యక్తి ఒక విలాసవంతమైన ఇంటిలో ఒంటరిగా ఉంటాడు. తనకి తోడుగా ఉండేలా ఐరిస్ అనే ఒక రోబోట్ ని తయారు చేసుకుంటాడు. ఐరిస్ చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. అది కూడా అందమైన అమ్మాయి రూపంలో ఉంటుంది. కానీ ఆమె ప్రోగ్రామింగ్ మొత్తం జోష్ ని సంతోష పెట్టడానికే ఉంటుంది. ఒక విహారయాత్రకు వెళ్లిన తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు ఐరిస్ ఒక మనిషి కాదు, జోష్ ఆధీనంలో ఉండే ఒక రోబోట్ అనే ట్విస్ట్ అప్పుడే రివిల్ అవుతుంది. అయితే జోష్ ఆమెను పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకోవాలని చూస్తాడు. ఆ రోబోట్ పై చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన యజమాని పెడుతున్న బాధలను భరిస్తూనే, ఐరిస్ తన లోపల ఉన్న AI ద్వారా సొంతంగా ఆలోచించడం మొదలుపెడుతుంది.

కథ ముందుకు సాగే కొద్దీ, జోష్ క్రూరత్వం పరాకాష్టకు చేరుతుంది. ఐరిస్ తన ప్రోగ్రామింగ్ ను మార్చుకుంటూ, అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు, జోష్‌కు మధ్య జరిగే భీకరమైన పోరాటం ఈ సినిమాలోని అసలు ట్విస్ట్. ఒక రోబోట్ తనను సృష్టించిన వాడిపైనే తిరగబడితే ఎలా ఉంటుంది? ఐరిస్ నిజంగా స్వేచ్ఛను పొందుతుందా ? జోష్ తన కుట్రలతో ఆమెను అణచివేస్తాడా? అనే అంశాలతో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

Advertisement

Read Also : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘స్పేస్ జెన్ చంద్రయాన్’… స్పేస్ అడ్వెంచర్ లవర్స్ కు ఐ ఫీస్ట్ ఈ సిరీస్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×