E-Paper
Advertisement

ఇంట్లోనే ఉండి రోబోల ద్వారా బయట ప్రపంచంలో బతికే వింత లోకం… నెవర్ బిఫోర్ సీన్స్

ఇంట్లోనే ఉండి రోబోల ద్వారా బయట ప్రపంచంలో బతికే వింత లోకం… నెవర్ బిఫోర్ సీన్స్
Advertisement

Science Fiction Movie on OTT : టెక్నాలజీతో ఈ కాలం పరుగులు పెడుతున్న సంగతి తెలిసందే. రోబోలతో ఒక మనుషుల లైఫ్ స్టైల్ కూడా మారిపోయేటట్లు కనిపిస్తోంది. ఇంట్లో పని మనుషులకు బదులు వీటినే ఉపయోగిస్తున్నారు చాలా చోట్ల. ఇవి చాలా మందికి గర్ల్ ఫ్రెండ్ లా కూడా సేవలు అందిస్తున్నాయంటే ఇది ఏ పాటిగా ప్రజల్లోకి వెళ్తుందో చెప్పవచ్చు. అయితే టెక్నాలజీతో ఎక్కువగా ఆధారపడితే సమస్యలు కూడా ఎలా వస్తాయో ఒక సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. భవిష్యత్తులో మనుషులు బయట తిరగడానికి బదులుగా, తమలాగే కనిపించే రోబోలను రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తూ ఇంట్లోనే ఉండిపోతారు. దీనివల్ల నేరాలు, వ్యాధులు ఉండవు. కానీ ఒక రోబోను చంపినప్పుడు దాని యజమాని కూడా చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో స్టోరీ ఆసక్తిగా సాగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2009లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా పేరు ‘సరోగేట్స్’ (Surrogates). ఇందులో బ్రూస్ విల్లీస్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ఎఫ్.బి.ఐ (FBI) ఏజెంట్‌గా బ్రూస్ విల్లీస్ కనిపిస్తారు. దీనికి దర్శకత్వం జోనాథన్ మోస్టో వహించగా, బ్రూస్ విల్లీస్ తో పాటు, రాధా మిచెల్, రోసమండ్ పైక్, వింగ్ రేమ్స్ వంటి నటులు నటించారు. ఇది ‘ది సరోగేట్స్’ అనే కామిక్ బుక్ ఆధారంగా తెరకెక్కింది. దీనిని సుమారు $80 మిలియన్ల భారీ బడ్జెట్‌తో టచ్‌స్టోన్ పిక్చర్స్ నిర్మించింది. షూటింగ్ ప్రధానంగా అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలో జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు $122.4 మిలియన్లను వసూలు చేసింది. దర్శకుడు జోనాథన్ మోస్టో, మనుషులు టెక్నాలజీపై ఎంతగా ఆధారపడుతున్నారో ఈ చిత్రం ద్వారా చూపించారు. విశేషమేమిటంటే, ఈ సినిమాలో చూపించిన కొన్ని రోబోలు కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, జపాన్‌కు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త హిరోషి ఇషిగురో రూపొందించిన నిజమైన ‘జెమినాయిడ్’ రోబోలను కూడా కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించారు. ఇది సైన్స్ ఫిక్షన్ ప్రియులను ఇప్పటికీ ఆకట్టుకునే అంశం. ప్రతుటామ Apple tvలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భవిష్యత్తులో ప్రజలు రిమోట్ కంట్రోల్ రోబోలను (సరోగేట్స్) ఉపయోగిస్తూ, తమ ఇళ్ల నుంచే బయటి ప్రపంచంతో కనెక్ట్ అవుతారు. అయితే ఈ రోబోలను చంపినప్పుడు, వాటిని నియంత్రించే అసలు మనుషులు కూడా చనిపోవడం మొదలవుతుంది. ఈ అసాధారణ పరిణామం సమాజంలో పెద్ద కలకలాన్ని సృష్టిస్తుంది. ఏజెంట్ గ్రీర్ (బ్రూస్ విల్లీస్) ఈ కేసును దర్యాప్తు చేస్తూ, ప్రమాదకరమైన ఒక కుట్రను బయటపెడతాడు. సరోగేట్స్ సృష్టికర్తే ఈ నాశనానికి వెనుక ఉన్నాడని గ్రీర్ గ్రహిస్తాడు.చివరికి గ్రీర్ ఆ కుట్రను అడ్డుకుని, ప్రపంచంలోని రోబోల సిగ్నల్‌ను కట్ చేస్తాడు. దీనివల్ల సరోగేట్స్ అన్నీ నిలిచిపోతాయి. ప్రజలు మళ్ళీ తమ నిజ జీవితంలోకి, బయటి ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. టెక్నాలజీపై అతిగా ఆధారపడటం వల్ల కలిగే పరిణామాలను ఈ సినిమా చూపిస్తుంది.

Read Also : ప్రియుడి ముందే అమ్మాయిని దారుణంగా… నెత్తురుడికించే శ్రీలంక సినిమా

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×