Tamil Nadu election Results Live Updates: తమిళనాడులో ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎవరిది? ఎప్పుడూ లేని విధంగా ఈసారి టీవీకె రంగంలోకి దిగడంతో రాజకీయ సీన్ ఒక్కసారిగా వేడెక్కిందా? ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిది? సీఎం స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామి, టీవీకె చీఫ్ విజయ్ నియోజకవర్గాల మాటేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
స్టాలిన్-పళనిస్వామి- విజయ్ నియోజకవర్గాల మాటేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. గడిచిన కొన్నాళ్లు చెన్నై సిటీలోని థంజండ్ లైట్స్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు స్టాలిన్. ఆ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 1996, 2001, 2006 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ నమోదు చేశారు.
ఆ తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. 2011, 2016, 2021 నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2011 నుంచి ప్రతీ ఎన్నికల్లో తన మెజార్టీ పెంచుకుంటూ వచ్చారు. ఈసారి లక్ష మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
అక్కడ జెండా ఎగురవేసేది ఎవరు?
ఇక అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విషయానికి వద్దాం. అన్నాడీఎంకె అధినేత, మాజీ సీఎం పళనిస్వామి.. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1991 నుంచి అన్నాడీఎంకె తరపున పళనిస్వామి బరిలోకి దిగారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు.
1996 ఎన్నికల్లో పళనిస్వామి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2011 నుంచి వరుసగా 2021 వరకు వరుసగా ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో 93 వేల మెజార్టీతో ఆయన గెలుచారు. ఈసారి అక్కడ ఏకపక్షంగా పళనిస్వామి గెలవడం ఖాయమన్నది అన్నాడీఎంకె వర్గాల మాట.
ALSO READ: కేరళ ఫలితాలకు ముందే సంచలనం.. సీఎం హోదాను తొలగించిన పినరయి విజయన్, ఓడిపోతానని ఫిక్స్ అయ్యారా!
ఇక టీవీకె చీఫ్ విజయ్ నియోజకవర్గం పెరంబూర్. ఈ నియోజకవర్గం ఓటర్లు ఇప్పటివరకు డీఎంకె, అన్నాడీఎంకె, సీపీఎం అభ్యర్థులను ఆదరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ మంది అభ్యర్థులు డీఎంకె నుంచి గెలుపొందారు. తొలిసారి ఈ నియోజకరవర్గం నుంచి నటుడు విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇది చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఘనత సీపీఎం పార్టీకి దక్కుతుంది. ఈసారి డీఎంకె, టీవీకె తోపాటు పీఎంకె, ఎన్‌టీకె కూడా బరిలోకి ఉండడంతో చతుర్ముఖ పోటీ మొదలైంది. ఆ నియోజకవర్గం ఓటర్లు పాత పార్టీల వైపు మొగ్గు చూపుతారా? విజయ్ పార్టీ వైపు తిరుగుతారా? అనేది చూడాలి.