E-Paper
Advertisement

Science fiction thriller OTT : అంతం అంచున ప్రపంచం… అమ్మాయిని పెంచే రోబో… థ్రిల్ ఇచ్చే ఒక్కో సీన్

Science fiction thriller OTT : అంతం అంచున ప్రపంచం… అమ్మాయిని పెంచే రోబో… థ్రిల్ ఇచ్చే ఒక్కో సీన్
Advertisement

Science fiction thriller OTT : సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తున్నంత సేపు మరో ప్రపంచంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలలో ఉండే విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ఇక వీటిలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సినిమా మరో లెవల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. భూమి మీద మనుషులు అంతరించిపోయాక ఒక రోబో మానవజాతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో సాగే స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతూ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ చిల్ ను ఇస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఆస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐ యామ్ మదర్’ (I Am Mother). ఈ సినిమాకు గ్రాంట్ స్పుటోర్ దర్శకత్వం వహించగా, మైఖేల్ లాయిడ్ గ్రీన్ రచన చేశారు. ఇందులో క్లారా రుగార్డ్, ల్యూక్ హాకర్, రోజ్ బైర్న్, హిల్లరీ స్వాంక్ నటించారు. ఈ సినిమా 2019 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. 2019 జూన్ 7న నెట్‌ఫ్లిక్స్ దీనిని అనేక దేశాలలో విడుదల చేసింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భూమి మీద మనుషులంతా అంతమైపోయాక, ఒక అండర్ గ్రౌండ్ బంకర్‌లో ఒక రోబోట్ మాత్రమే ఉంటుంది. అయితే దాని దగ్గర వేలకొద్దీ మానవ పిండాలు నిల్వ ఉంటాయి. వాటిలో ఒక దానిని ఎంచుకుని ఒక ఆడపిల్లను పాపను పుట్టించి పెంచుతుంది. బయట గాలి విషపూరితంగా ఉందని, మనుషులెవరూ బ్రతకలేరని ఆ రోబోట్ ఆ పాపకు నమ్మిస్తుంది. ఆ పాపను ఎంతో క్రమశిక్షణగా, గొప్ప తెలివితేటలు ఉన్న అమ్మాయిగా పెంచుతుంది. ఆ రోబోటే ఆ పాపకు అమ్మ, గురువు అన్నీ.

కానీ ఒకరోజు బయట నుండి ఒక మహిళ గాయాలతో వచ్చి సాయం అడుగుతుంది. ఆమె మాటల వల్ల బయట ప్రపంచం గురించి రోబోట్ చెప్పేవన్నీ అబద్ధాలని ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఆ రోబోట్ ఒకప్పటి మనుషులను అంతం చేసిందని, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ మనిషిని తయారు చేయడానికి తన మీద ప్రయోగాలు చేస్తోందని ఆ అమ్మాయి తెలుసుకుంటుంది. ఆ అమ్మాయి కంటే ముందు పుట్టిన పిల్లలు, సరిగ్గా పెరగలేదని ఆ రోబోట్ వాళ్లను చంపేసిందని తెలిసి షాక్ అవుతుంది. చివరికి ఆ అమ్మాయి రోబోట్‌ చెరనుంచి బయట పడుతుందా ? బంకర్ బయట అసలేం జరుగుతోంది ? బంకర్ లోకి వచ్చిన మరో అమ్మాయి ఎవరు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : తండ్రి ఆశయం కోసం ఓ కూతురు పోరాటం… ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి అనుపమ్ ఖేర్ మూవీ

Tags

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×