E-Paper
Advertisement

Tanvi The Great on OTT : తండ్రి ఆశయం కోసం ఓ కూతురు పోరాటం… ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి అనుపమ్ ఖేర్ మూవీ

Tanvi The Great on OTT : తండ్రి ఆశయం కోసం ఓ కూతురు పోరాటం… ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి అనుపమ్ ఖేర్ మూవీ
Advertisement

Tanvi The Great on OTT : ఓటీటీలోకి మరో కొత్త సినిమా అడుగు పెట్టింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనేక మంది ప్రశంసించారు కూడా. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించినప్పుడు ఏడు నిమిషాల పాటు Standing Ovation ను కూడా అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా 98వ అకాడమీ అవార్డ్స్ జాబితాలో చోటు కూడా సంపాదించుకోవడం విశేషం. ఆటిజంతో ఉన్న ఒక యువతి, తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి భారత సైన్యంలో చేరాలని చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్

అనుపమ్ ఖేర్ స్టూడియో, ఎన్‌ఎఫ్‌డిసి బ్యాన‌ర్స్‌పై అనుపమ్ ఖేర్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ (Tanvi The Great) 2025 జూలై 18న థియేటర్లలో విడుదలైంది. ఈ హిందీ సినిమాలో అనుపమ్ ఖేర్, శుభాంగి దత్, ఇయాన్ గ్లెన్, జాకీష్రాఫ్, అరవిందస్వామి, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) లో 2026 మార్చి 3 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. గతంలో అంటే 2002లో ‘ఓం జై జగదీష్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుపమ్‌ ఖేర్‌, దాదాపు రెండు దశబ్ధాల తరువాత ‘తన్వీ ది గ్రేట్‌’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ చాలా ఎమోషనల్‌గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. తన్వీ రైనా అనే 21 ఏళ్ల అమ్మాయికి ఆటిజం ఉంటుంది. అయితే ఆమె తండ్రికి ఒక పెద్ద కల ఉండేది. అదేంటంటే భారత సైన్యంలో చేరి సియాచిన్ గ్లేసియర్ దగ్గర దేశ జెండాకు సెల్యూట్ చేయాలని. కానీ ఆయన చనిపోవడంతో ఆ కల నెరవేరదు. తన తండ్రి ఆశయాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని తన్వీ గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో ఆమె తన తాతయ్య దగ్గరకు వెళ్తుంది. ఆయన చాలా స్ట్రిక్ట్. ఆటిజం ఉన్న అమ్మాయి ఆర్మీలోకి వెళ్లడం అసాధ్యమని అందరూ అనుకుంటారు. కానీ తన్వీ మాత్రం వెనక్కి తగ్గదు. కఠినమైన ఆర్మీ ట్రైనింగ్‌ను తీసుకుంటుంది. ఆమెకు తాతయ్య కూడా అండగా నిలుస్తాడు. చివరకు తన్వీ తండ్రి కలను నెరవేర్చిందా ? ట్రైనింగ్‌ లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది ? ఆమెకు తాతయ్య ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : యజమానికి చుక్కలు చూపించే రోబో… అబ్బురపరిచే విజువల్స్… ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×