BigTV English

OTT Movie : పాటలు పాడుతూ రోగాన్ని నయం చేసే అమ్మాయి … ఈ ఆమ్మాయి టాలెంట్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

OTT Movie : పాటలు పాడుతూ రోగాన్ని నయం చేసే అమ్మాయి … ఈ ఆమ్మాయి టాలెంట్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

OTT Movie : ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రకరకాల సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇప్పడు మనం చెప్పుకునే మూవీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి పాటలు పాడుతూ ఒక జబ్బును నయం చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో

ఈ రాజస్థానీ సినిమా పేరు ‘స్కార్ పియన్ సాంగ్’ (Scorpion song). దీనికి అనుప్ సింగ్ దర్శకత్వం వహించారు. 2017లో రిలీజ్ అయిన ఎ మూవీలో గోల్షిఫ్టే ఫరాహానీ, ఇర్ఫాన్ ఖాన్, వహీదా రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా స్టోరీ రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో జరుగుతుంది, ఇక్కడ ఒక పురాతన కధ ప్రకారం, తేళ్ల కాటుకు గురైన వ్యక్తి 24 గంటల్లో చనిపోతాడు. అయితే స్కార్పియన్ సాంగ్ అనే పాటను పాడే ఒక ప్రత్యేక గాయకుడు ఆ విషాన్ని తొలగించి ప్రాణాలను కాపాడుతాడు. ఈ నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది.నూరాన్ అనే ఒక గిరిజన సముదాయానికి చెందిన స్వతంత్ర మనస్తత్వం గల అమ్మాయి. ఆమె తన తాతమ్మ జుబైదా నుండి తేళ్ల కాటును నయం చేసే పురాతన కళను నేర్చుకుంటుంది.. జుబైదా ఒక ప్రసిద్ధ “స్కార్పియన్ సింగర్”, అంటే తేళ్ల విషాన్ని పాట ద్వారా తొలగించే శక్తి కలిగిన స్త్రీ. ఒక రోజు, ఆదమ్ అనే ఒంటెల వ్యాపారి నూరాన్ పాడుతున్న పాటను విని ఆమె పట్ల ప్రేమలో పడతాడు. ఆదమ్ ఆమెను వివాహం చేసుకోవాలని పట్టుబడతాడు, కానీ నూరాన్ మొదట్లో అతన్ని తిరస్కరిస్తుంది. అయితే, కథ ఒక చీకటి మలుపు తిరుగుతుంది. ఒక రాత్రి, ఆదమ్ స్నేహితుడు మున్నా తేళ్ల కాటుకు గురైనట్లు నటించి, నూరాన్‌ను మోసం చేస్తాడు. ఆ సందర్భంలో ఆమెపై దాడి చేసి, ఆమె జీవితాన్ని నాశనం చేసే దారుణమైన చర్యకు పాల్పడతాడు. ఈ దాడి తర్వాత నూరాన్ తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు, తన తాతమ్మ జుబైదా కనిపించకుండా పోతుంది. ఈ రెండు దెబ్బల వల్ల నూరాన్ తన పాట పాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఆమె జీవనోపాధి కూడా దెబ్బతింటుంది.

ఈ పరిస్థితుల్లో ఆదమ్, నూరాన్‌ను వివాహం చేసుకోవాలని మళ్లీ ప్రతిపాదిస్తాడు. ఆమె అతని ఇంటికి వెళ్లిన తర్వాత, ఆదమ్‌కు ఇప్పటికే వివాహం అయి ఒక కుమార్తె ఉందని తెలుస్తుంది. నూరాన్ ఈ కొత్త పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక రోజు, ఆదమ్ మున్నాపై తేళ్లను వదులుతాడు, మున్నా చనిపోయే ముందు నూరాన్‌కు ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడిస్తాడు.ఒకరోజు నూరాన్ గర్భవతి అని తెలుస్తుంది, ఈ విషయం తెలిసి ఆమె దుఃఖంలో మునిగిపోతుంది. చివరికి, ఆమె ఆదమ్‌ను ఎదుర్కొంటుంది. ఆదమ్ తన ప్రేమ నిజమని చెప్పి, తాను కూడా తేళ్ల కాటుకు గురవుతాడు. ఆ క్షణంలో నూరాన్ “స్కార్పియన్ సాంగ్” పాడటం ప్రారంభిస్తుంది, కానీ ఆ పాట ఎవరిని కాపాడటానికి? ఆదమ్‌నా లేక మారెవరినైనా?ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ ని మిస్ కాకుండా చూడండి.

 

Related News

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

Big Stories

×