Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. దీంతో హీరోగా తాను గతంలో ఒప్పుకున్న సినిమాల పై నిత్యం ఏదొక చర్చవినిపిస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు మూడు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాలను పక్కన పెట్టేసారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ సినిమాలు సగభాగం షూటింగ్ ని పూర్తి చేసుకొని మిగిలిన భాగం షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని డేస్ ఇచ్చి ఆ డేట్స్ లో మాత్రమే షూటింగ్ కి వస్తానని ఆ మధ్య హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన ఏ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు దాంతో ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? లేదా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : వామ్మో.. ఒక్కరోజుకు వంటలక్క రెమ్యూనరేషన్ అన్ని లక్షలా..?
రాజకీయాల్లో బిజీగా పవన్ కళ్యాణ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. దాంతో ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను భుజాన వేసుకొని స్వయాన తానే ప్రజల వద్దకు వెళ్లి సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారాలను అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు తీరిక లేకుండా రాజకీయాల్లోనే గడుపుతున్నారు.. దానివల్ల సినిమాలను పక్కన పెట్టేసారన్న విషయం తెలిసిందే. అయితే అటు సినిమా వాళ్లు ఇటు అభిమానులు ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను అయినా పూర్తి చేయాలని కోరుతున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు అంటూ ఓ వార్త మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఇక సినిమాల జోలికి వెళ్ళరా? అదంతా కేవలం గాసిపా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమాలకు ప్యాకప్ చెప్పేసిన పవన్ కళ్యాణ్..
హరిహర వీరమల్లు, ఊస్తాద్ భగత్ సింగ్, OG వంటి ప్రాజెక్టులతో పవన్ ఫుల్ బిజీగా ఉండగా, అదే సమయంలో పొలిటికల్ కమిట్‌మెంట్స్ వల్ల మరింతగా డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అసలే డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు సమయం కేటాయించడం కష్టంగా మారింది.. దానితో మేకర్స్ వేరే హీరోతో ఈ సినిమాను పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలకు పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు తీసుకున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైతే మరి తీసుకున్న అడ్వాన్స్ల సంగతేంటి? అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ కు నిర్మాత రామ్ అడ్వాన్స్ ఇచ్చినట్లు గత ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. కచ్చితంగా ఆయనతో ఏదో ఒక సినిమా జరిగేలా ప్లాన్ చేస్తామని అన్నారు. ఇప్పటివరకు పవన్ ఏదో ఒక రకంగా సినిమాలకు డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు.. అయితే గతంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన సినిమాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. చాలా బిజీ అయ్యారు కాబట్టి ఏదో ఒక సినిమా చేస్తారా లేదంటే అడ్వాన్స్ లు తిరిగి వెనక్కి ఇస్తారా? అన్నది ప్రశ్నార్ధకం.. మరి చూడాలి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా?సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులు వెనక్కి ఇస్తారా? అన్నది..