Karthika Deepam : తెలుగు బుల్లితెరపై కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. ఆ సీరియల్స్ అయిపోతున్నాయి అంటే అంతగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాంటి ప్రేక్షకధారణ పొందిన సీరియల్స్లలో కార్తీకదీపం ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ప్రస్తుతం కార్తీకదీపం 2 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. వంటలక్కగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమీ విశ్వనాథ్. డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్ అంశాలతో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు ఈమె రెమ్యూనరేషన్ హీరోలకు తీసిపోదు. మరి ఆమె ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
వంటలక్క పాత్రకు ప్రేక్షకుల కనెక్ట్..
కార్తీకదీపం సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్ దీప పాత్రలో నటించినది.. అదే వంటలక్క పాత్ర.. ఈ సీరియల్ లోని ఈ పాత్రకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు దీపా తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందో అన్న పాయింట్ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ సీరియల్ మొదటి సీజన్ అయిపోయింది ప్రస్తుతం రెండో సీజన్ అంటే కార్తీకదీపం 2 స్టార్ మా లో టెలికాస్ట్ అవుతుంది. 2017 అక్టోబర్ 16 నుంచి మొదలైన కార్తీక దీపం డైలీ సీరియల్ 2023 జనవరి 23 వరకు కొనసాగింది.
దాదాపు ఐదున్నర ఏళ్లపాటు మొదటి సీజన్ ప్రసారమైంది. సీరియల్ నటుడు నిరూపం ఇందులో ప్రధాన పాత్రలో నటించగా, శోభా శెట్టి మోనిత పాత్రలో నటించి మెప్పించింది.. వీరిద్దరి నటనకు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ముఖ్యంగా వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఆడియన్స్ తో కంటతడి పెట్టించింది. తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ అన్నింటిలోనూ ఎక్కువగా అందరు గుర్తుండి పోయే పాత్ర వంటలక్క.. ఈ సీరియల్ రెండో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.. అయితే సీరియల్ భారీ సక్సెస్ అయ్యింది. దాంతో వంటలక్క రెమ్యూనరేషన్ ఎంత అనే డిస్కషన్ మొదలైంది. మరి ఈ పాత్ర కోసం ప్రేమీ విశ్వనాథ్ ఒక్క రోజుకి ఎంత తీసుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read :ఎన్టీఆర్ హలీమ్ ను ఎక్కడ తింటాడో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..
ప్రేమీ విశ్వనాథ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..
వంటలక్క పాత్రకు ఈరోజు సీరియల్ లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం.. ఈమె గురించి పర్సనల్ విషయాలు పెద్దగా తెలియవు కానీ సీరియల్ లో మాత్రం వంటలకగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. కార్తీకదీపం 2 సీరియల్ కు ఆమె అందుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు ఆసక్తికరంగా మారాయి.. మలయాళం సీరియల్స్ లో నటించి మెప్పించింది. అక్కడ మంచి గుర్తింపు రావడంతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి. ఈమె ఒక్కరోజు షూటింగ్ కి ప్రస్తుతం 50 వేల రూపాయలు ఛార్జ్ చేస్తుందంట.. నెలలో దాదాపు 20 రోజుల వరకు షూటింగ్లో బిజీగానే ఉంటుందట. దాంతో ఈ మరేమరేషన్ 10 నుంచి 12 లక్షలు వరకు ఉంటుందని టాక్.. ఇప్పటివరకు సీరియల్స్ స్టార్ హీరోకు కూడా ఇంత రెమ్యూనరేషన్ రాలేదు. నిజంగా గ్రేట్ కదా..