E-Paper
Advertisement

Biker Movie Release: శర్వానంద్ మూవీ డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్?

Biker Movie Release: శర్వానంద్ మూవీ డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్?
Advertisement

Sharwanand Biker Movie Release : ఇండస్ట్రీలో శర్వానంద్ ప్రామిసింగ్ యాక్టర్. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన సినిమాలంటే.. ఓ సెక్షనాఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌తో చూస్తారు. అలాగే ఈయన గారి స్టోరీ సెలక్షన్ కూడా బానే ఉంటుంది. అందుకే… శర్వా సినిమాలు అంటే ఆడియన్స్‌కు ఇష్టం. ఇప్పుడు ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ ఉన్నాయి. అందులో నారి నారి నడమ మూరారి సినిమా సంక్రాంతికి ఫిక్స్ అయిపోయింది. దీంతో సమస్యేమీ లేదు. కానీ, ఇప్పుడు తలనొప్పి అంతా.. బైకర్ గురించే.

శర్వానంద్ గత మూడేళ్లుగా ఫుల్ ఫోకస్‌తో చేస్తున్న సినిమా బైకర్. ఈ సినిమా కోసం పాపం శర్వానంద్ కూడా చాలా సన్నబడ్డాడు. రేసింగ్ నేపథ్యంలో సాగుతుంది ఆ మూవీ. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ, రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. ఆల్మోస్ట్ పక్కన పెట్టే పరిస్థితి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వచ్చింది.

Advertisement

సడన్‌గా డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ అంటూ పోస్టర్లు వచ్చాయి. పోస్టర్లు అయితే వచ్చాయి కానీ, ప్రమోషన్స్ మాత్రం చేయలేదు. దీంతో అనుకున్నట్టే ఈ మూవీ డిసెంబర్ 6వ తేదీ నుంచి వాయిదా పడింది.

డిసెంబర్ 6 తర్వాత రిలీజ్ డేట్ విషయంలో చాలా వార్తలు వినబడ్డాయి. డిసెంబర్ 17 అని డిసెంబర్ 31 అంటూ ఎవరికి వారు అనుకున్నారు. కానీ, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేయడమే కష్టమని తెలుస్తుంది.

ఓటీటీ ఒత్తిడి..

Advertisement

ఈ మధ్య కాలంలో సినిమాలపైన ఓటీటీ యాజమాన్యాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓటీటీ యాజమాన్యాల సూచనల మేరకే ఆ మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేస్తున్నారు నిర్మాతలు. కారణం.. ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆయా యాజమాన్యాలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లాన్ ప్రకరమే సినిమాల థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి బైకర్ మూవీకి ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ బైకర్ మూవీ షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తి అయింది. ఓటీటీ డీల్ కూడా అప్పుడే అయిందంట. అప్పటి నుంచి రిలీజ్ కోసం ఓటీటీ వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారంట. డిసెంబర్ ఇక ఫైనల్ అనుకున్నారు. అది కూడా అవ్వలేదు.

NNNM మూవీ మరో వైవు..

ఇటు ఓటీటీ ఒత్తిడి ఉండగానే.. మరో వైపు శర్వానంద్ నటించిన నారి నారి నడమ మూరారి మూవీ రిలీజ్ మరో వైపు ఉంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచాలని నిర్మాతలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. శర్వాకు సంక్రాంతి సీజన్‌కు సంబంధించి శతమానం భవతి మూవీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదే అంచనాలతో ఈ NNNM మూవీని దింపుతున్నారు.

దీంతో బైకర్ మూవీ వేరే ఆప్షన్ ఏం లేదు. ఒక వేళ రిలీజ్ చేయాల్సి వస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి వరకు వెయిట్ చేయాలి. ఫిబ్రవరిలో కష్టమే. ఇక మార్చిలో అంటే.. రామ్ చరణ్ పెద్ది ఉంది. నాని ది ప్యారడైజ్ ఉంది. అంటే మార్చి కూడా కష్టమే. ఇక తర్వాత మంత్ అంటే ఓటీటీ ఒత్తిడి కూడా ఉంది.

ఇప్పటికే డిసెంబర్ నుంచి వాయిదా అంటే.. ఓటీటీ యాజమాన్యం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో థియేట్రికల్ రిలీజ్ పక్కన పెట్టి.. బైకర్ ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్‌లోనే డైరెక్ట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారంట నిర్మాతలు.

అదే జరిగితే… ఈ క్రిస్మస్ లేదా జనవరి మొదటి వారంలో బైకర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×