E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. డిప్యూటీ సీఎం హోదాలో అలా మాట్లాడితే ఎలా..?

Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. డిప్యూటీ సీఎం హోదాలో అలా మాట్లాడితే ఎలా..?
Advertisement

Kalvakuntla Kavitha: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ నటుడి హోదాలో ఉన్నప్పటి నుండి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడితే కుదరదు..

Advertisement

పవన్ కళ్యాణ్ నటుడిగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడిన చెల్లింది.. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడితే కుదరదు అని కవిత స్పష్టం చేశారు. ‘కోనసీమ మాదిరి తెలంగాణ కావాలనుకున్నాం. మేం ఎప్పుడూ జై తెలంగాణ, జై ఆంధ్రా అన్నాం’ అని ఆమె గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ‘తెలంగాణ వారి దిష్టి తగిలింది’ అన్న వ్యాఖ్యలపై కవిత ఓ రేంజ్ లో ఫైరయ్యారు.

తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు..

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను ఆనాడు పార్లమెంట్‌లో మాట్లాడానని కవిత ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదని.. ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ ఇకపై తన హోదాను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మాట్లాడాలని కవిత సూచించారు. ఆయన ఆలోచించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతగా మాట్లాడాలి…

డిప్యూటీ సీఎం హెదాలో ఉన్నప్పుడు బాధ్యతగా.. ఆలోచించి మాట్లాడాలని కవిత అన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో చేసిన వ్యాఖ్యల మధ్య తేడాను గుర్తించాలని ఆమె సూచించారు.

ALSO READ: Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో భారీ శబ్ధంతో బాంబు పేలుడు.. భయాందోళనలో ప్రయాణికులు

Related News

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×