E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అఫీషియల్ శర్వానంద్ బైకర్ ఓటీటీ డేట్ లాక్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఫీషియల్ శర్వానంద్ బైకర్ ఓటీటీ డేట్ లాక్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Biker OTT:  ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా 28 రోజులలో తిరిగి సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మార్చి నెలలో విడుదలైన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. ఇక మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా ఒకటి. ఈ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది.

రేసింగ్ నేపథ్యంలో బైకర్..

ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ రేసింగ్ నేపథ్యంలో సినిమాలు రావడం చాలా తక్కువ అలాంటిది శర్వానంద్ ఈ సినిమాలో రేసర్ గా కనిపించే సందడి చేశారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు యూవీ క్రియేషన్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

మే 1నుంచి నెట్ ఫ్లిక్స్ లో బైకర్..

Advertisement

థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారక ప్రకటన తెలియజేశారు. శర్వానంద్ బైకర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ వాడికి రేసింగ్ అంటే ప్రాణం కాదు.. అదే జీవితం అంటూ ఈ సినిమా మే ఒకటో తేదీ నుంచి తెలుగుతోపాటు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇలా థియేటర్లలో విడుదలైన 28 రోజులకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కావడంతో థియేటర్లలో ఈ సినిమాని చూడటం మిస్ అయినవారు ఎంచక్కా ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ(శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్ గా ఉంటారు. ఈయన తండ్రి సునీల్ నారాయణ (రాజశేఖర్) ట్రైనింగ్ లోనే విక్కీ రేసింగ్ పై మంచి పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో సత్తా చాటిన సునీల్ ఇప్పుడు తన కొడుకును కూడా ప్రపంచ ఛాంపియన్ గా చూడాలని కోరుకుంటాడు. ఇలా రేసింగ్ లో టాపర్ గా ఉన్నటువంటి విక్కీ ఉన్నఫలంగా రేసింగ్ వదిలేసి వెళ్ళిపోతాడు దీంతో సునీల్ కు చాలా అవమానం ఎదురవుతుంది. ఇలా రేసింగ్ నుంచి వెళ్లిపోయిన విక్కీ తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకుతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు అయితే తన తండ్రికి జరిగిన అవమానం తెలిసి విక్కీ తిరిగి రేసర్ గా మారతారా? విక్కీ సడన్ గా రేసింగ్ వదిలేసి ఎందుకు వెళ్ళాడు? అనన్యతో విక్కీ లవ్ స్టోరీ ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన మెహ్రీన్ .. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Related News

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదా… డోంట్ వర్రీ ఈ 5 అద్భుతమైన సినిమాలు ఫ్రీగానే చూడవచ్చు

ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం

నెట్ ఫ్లిక్స్ ను శాసిస్తున్న రూ.4566 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?

‘ది వాకింగ్ డెడ్: డారిల్ డిక్సన్ సీజన్ 4’ లోడింగ్… క్రేజీ హింట్ ఇచ్చిన హీరో

విదేశాలకు వెళ్ళే వాళ్లే టార్గెట్… అవయవాల అక్రమ రవాణాతో హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా

చూడకూడని సీన్స్ లేవు… కడుపుబ్బా నవ్వించే కామెడీ… ఫ్యామిలీ ఆడియన్స్ కు మస్త్ మజా

పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్

ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్

Big Stories

×