E-Paper
Advertisement

సైలెంట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన మెహ్రీన్ .. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

సైలెంట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన మెహ్రీన్ .. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!
Advertisement

Mehreen pirzada: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.. విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు అల్లు శిరీష్ వివాహం చేసుకున్నారు .ఇక త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నఫలంగా నటి మెహ్రీన్ పిర్జాదా (Mehreen pirzada) సోషల్ మీడియా వేదిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా సైలెంట్ గా ఈమె పెళ్లి పీటలు ఎక్కడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు మెహందీ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న నటి..

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇక మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు అర్ష్ ఔలక్(Arshaulakh) అనే వ్యక్తితో పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈయన ఎవరు ఏం చేస్తారు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈమె ప్రేమా వివాహం చేసుకున్నారా? లేదా పెద్దలు చూసిన వివాహం చేసుకున్నారా అనే విషయాలు గురించి ఎక్కడ సమాచారం ఇవ్వలేదు. ఇక ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలను చూస్తుంటే కనుక తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.

మెహ్రీన్ పిర్జాదా దంపతులకు అభినందనలు..

Advertisement

గత కొంతకాలంగా మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా తన పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారడంతో ఈమె తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదని తన పెళ్లి గురించి అసత్యపు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ ఈమె తన పెళ్లి వార్తలను గతంలో ఖండించారు . అయితే ఉన్నఫలంగా ఈమె పెళ్లి చేసుకొని పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా మెహ్రీన్ దంపతులకు అభిమానులు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం..

Advertisement

ఇకపోతే గతంలో ఈమె భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. 2021 లో ఈ నిశ్చితార్థం జరిగింది .అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిశ్చితార్తాన్ని రద్దు చేసుకున్నారు. ఇలా ఈమె నిశ్చితార్థం రద్దు కావడంతో అప్పటినుంచి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇక ఈమె నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీరప్రేమగాధ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. అనంతరం ఎఫ్2, ఎఫ్ 3 వంటి సినిమాలలో నటించి ఎంతోమంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

Also Read: ఓటీటీ విడుదల తేదీలో మార్పులు..ముందుగానే వస్తున్న ది కేరళ స్టోరీ 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×