E-Paper
Advertisement

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ డీల్ క్లోజ్… ప్రముఖ ఓటీటీ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్!

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ డీల్ క్లోజ్… ప్రముఖ ఓటీటీ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్!
Advertisement

Biker OTT: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన రేసింగ్ నేపథ్యంలో నటించిన బైకర్ (Biker) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా అప్పటికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేసుకుంది. ఇలా బైకర్ సినిమా విడుదల వాయిదా పడటంతో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ద్వారా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నెట్ ఫ్లిక్స్ చేతికి బైకర్ డిజిటల్ రైట్స్..

సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ శర్వానంద్ కూడా నారీ నారీ నడుమ మురారి సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్లను రాబడుతుందని చెప్పాలి. ఇక శర్వానంద్ బైకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా వెల్లడించింది.

బైక్ రేసర్ గా శర్వానంద్..

Advertisement

ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనే విషయాలు త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నారు. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మోటో క్రాస్ రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడు తరాల కుటుంబ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నారు.

Advertisement

ఈ సినిమా నుంచి పలు అప్డేట్స్ విడుదల చేశారు అలాగే కొన్ని పాటలు కూడా విడుదల చేయగా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇప్పటివరకు ఇలా రేసింగ్ నేపథ్యంలో సినిమాలు రావడం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో బైకర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శర్వాకు జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్గా నటించగా ఈ సినిమాని యువీ క్రియేషన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన శర్వానంద్ బైకర్ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Mahesh Babu: మహేష్ బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇబ్బంది పడిన సూపర్ స్టార్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×