E-Paper
Advertisement

Long-Range Electric Bikes 2026: ఇండియాలో టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, ఒక్కోటి ఎంత దూరం వెళ్తాయంటే?

Long-Range Electric Bikes 2026: ఇండియాలో టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, ఒక్కోటి ఎంత దూరం వెళ్తాయంటే?
Advertisement

ఇండియన్ మార్కెట్ లో బోలెడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించేలా ఆయా కంపెనీలు ఈవీలను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం దేశీ మార్కెట్ లో ఉన్నఎక్కువ రేంజ్ స్కూటర్లు, బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఓలా రోడ్‌స్టర్ ప్రో: 225 కి.మీ

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇండియాలో ఎక్కువ రేంజ్ అందించే బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 52kW మోటార్‌ తో పవర్ ను అందిస్తుంది. ఇది 1.9 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 194 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది 8kWh, 16kWh బ్యాటరీ వేరియంట్స్ తో వస్తుంది. 10 అంగుళాల TFT టచ్‌ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 4 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.  సుదూర ప్రయాణాల కోసం రూపొందించబడిన ఈ బైక్ స్పోర్టీ ఫ్రేమ్ తో వస్తుంది. ఒకే ఛార్జ్‌ తో 225 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.  దేశంలో సుదూర ప్రయాణాలకు అద్భుతమైన అధునాతన ఎలక్ట్రిక్ బైక్ ఇదే. ఓలా రోడ్‌ స్టర్  ఓలా స్కూటర్లలో అత్యంత సాంకేతికతతో పాటు లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఒక పూర్తి ఛార్జింగ్ కు సుమారు 6 గంటల సమయం పడుతుంది.

⦿ అల్ట్రా వాయిలెట్ F77: 307 కి.మీ

Advertisement

ఈ బైక్ కూడా లాంగ్ రేంజ్ ను అందిస్తుంది. ఈ స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్ అద్భుతమైన పికప్ ను కలిగి ఉంటుంది.  ఇది 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 8 సెకన్లలో అందుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్, నావిగేషన్, కాల్, ఎస్సెమ్మెస్ అలర్ట్,  జియో ఫెన్సింగ్, లైట్ సెన్సార్, క్రాష్ డిటెక్షన్ ఎర్రర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్క ఛార్జ్ తో 307 కి.మీ వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక దూరం వెళ్లే ఎలక్ట్రిక్ బైక్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. పూర్తి ఛార్జ్ కు 5 గంటల సమయం పడుతుంది.

⦿  శ్రీవారు ప్రాణ 2.0: 250 కి.మీ  

శ్రీవారు ప్రాణ 2.0 ఎలక్ట్రిక్ బైక్ GPS డిజిటల్ స్పీడోమీటర్, LFP బ్యాటరీ సొల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ స్టీల్ ప్యాక్‌లో వస్తుంది. సౌకర్యవంతమైన, సురక్షితమైన సిటీ రైడింగ్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ లేటెస్ట్ వెర్షన్ మెరుగైన ఏరోడైనమిక్స్, మెరుగైన శ్రేణి కోసం ఆప్టిమైజ్ చేయబడింది. ఈ బైక్ పూర్తి ఛార్జ్ మీద 250 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ బైక్ పూర్తి ఛార్జింగ్ కు 7 గంటల సమయం పడుతుంది.

⦿ కోమాకి రేంజర్: 250 కి.మీ

Advertisement

ఈ ఎలక్ట్రిక్ బైక్ క్లాసీ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది  ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఎక్స్‌ టర్నల్ స్పీకర్లు, డిజిటల్ ట్రిప్ మీటర్, రియర్ ప్రొటెక్షన్ గార్డ్, ఛార్జింగ్ పాయింట్, EBS, తక్కువ బ్యాటరీ ఇండికేటర్, కాల్స్, ఎస్సెమ్మెస్ అలర్ట్, రివర్స్ అసిస్ట్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ బైక్ ఒక్క ఛార్జ్ తో ఏకంగా 250 కి.మీ రేంజ్ ను పొందుతుంది. 80 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్ కు సుమారు 6 గంటల సమయం పడుతుంది.

⦿ ఓలా రోడ్‌స్టర్: 250 కి.మీ

ఓలా రోడ్‌స్టర్ డిజైన్, మేకింగ్ ఫీచర్స్ చాలా బాగుంటాయి. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ కూడా ఇందులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ మంచి బ్యాటరీని కలిగి ఉంటుంద. MCU, ADAS, ABSతో కూడిన స్మార్ట్ E & E ఆర్కిటెక్చర్‌ తో వస్తుంది.  ఇది ప్రో వెర్షన్ కంటే కొంచెం తక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, అదే డిజైన్ లాంగ్వేజ్, బ్యాటరీ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటుంది. రియల్ వరల్డ్ లో 200 నుంచి  250 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్ కు 5 గంటల సమయం పడుతుంది.

Read Also:  ఓలా అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్ పై ఏకంగా రూ. 50 వేలు తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×