E-Paper
Advertisement

Amazon Forest Uncontacted Tribe: అమెజాన్ అడవుల్లో వింత లోకం.. బాహ్య ప్రపంచానికి తెలియని తెగ కెమెరా కంటికి చిక్కిందిలా!

Amazon Forest Uncontacted Tribe: అమెజాన్ అడవుల్లో వింత లోకం.. బాహ్య ప్రపంచానికి తెలియని తెగ కెమెరా కంటికి చిక్కిందిలా!
Advertisement

Amazon Forest Uncontacted Tribe: అమెజాన్ అడవుల్లో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న ఒక ఆదిమ తెగకు సంబంధించిన అరుదైన అత్యంత వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత పాల్ రోసోలీ, పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అద్భుతమైన దృశ్యాలను మొదటిసారిగా బయటపెట్టారు.

అమెజాన్ అడవుల్లో గత రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న పాల్ రోసోలీ, ఈ వీడియోను ప్రపంచంలోనే మొట్టమొదటిది అని అభివర్ణించారు. సాధారణంగా బాహ్య ప్రపంచానికి తెలియని తెగల దృశ్యాలు వందల మీటర్ల దూరం నుండి తీయడం వల్ల చాలా అస్పష్టంగా ఉండేవి. కానీ, ఈ వీడియోలో ఆ తెగ మనుషుల హావభావాలు, వారి కదలికలు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

అధునాతన 800mm లెన్స్, టెలికన్వర్టర్ల సాయంతో తీసిన ఈ వీడియో క్లిప్‌లో ఆ తెగ వారు అడవి నుంచి బీచ్‌లోకి వస్తుండగా, వారి చుట్టూ వేలాది సీతాకోకచిలుకలు కమ్ముకుని ఉండటం ఆక‌ట్టుకుంటోంది. మొదట వారు చాలా అప్రమత్తంగా, చేతిలో విల్లులు, బాణాలతో కనిపిస్తారు. తమ ముందున్న వ్యక్తులు శత్రువులా లేక మిత్రులా అని వారు విశ్లేషించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

తమపై దాడి జరుగుతుందేమోనని రోసోలీ బృందం భయపడుతున్న సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ ఆదిమ తెగ వారు దగ్గరకు వస్తున్న కొద్దీ, తమ చేతుల్లోని ఆయుధాలను కింద పడేశారు. అపరిచితులను చూడగానే ఆ తెగ వారు ఆయుధాలను వదిలేయడం ఒక చారిత్రాత్మక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: ఏకంగా 47 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసిన ప్రభుత్వం, ఇక కష్టమే!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×