E-Paper
Advertisement

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Hollywood Action Thriller: దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పించడానికైనా వెనకాడరు. మనం ఇంత భద్రంగా, ప్రశాంతంగా బతుకుతున్నాము అంటే కారణం వాళ్లే. అయితే శత్రుమూకలకు చెమటలు పట్టించే ఆ సైనికులే… కొన్ని సీక్రెట్ మిషన్స్ లో పాల్గొంటారన్న విషయం తెలిసిందే. మారు పేరుతో, కొత్త వేషంలో స్పైలుగా తిరిగుతూ ప్రభుత్వానికి అవసరం అయిన సమాచారాన్ని రాబడుతుంటారు. మరి అలాంటి వాళ్ళకు సొంత గవర్నమెంటే హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి ? అన్నది తెలియాలంటే ‘స్నైపర్ నో నేషన్’ (Sniper No Nation) అనే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే విషయాలను డీటైల్డ్ గా చూసేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కోస్టా వెర్డేలో జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. దీంతోనే కథ మొదలవుతుంది. దాంతో యూఎస్ ప్రభుత్వం తమ రహస్య విభాగం ‘G.R.I.T.’ను అధికారికంగా రద్దు చేసి, అందులోని సభ్యులందరినీ దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది. ముఖ్యంగా స్నైపర్ బ్రాండన్ బెకెట్ ను అతని సొంత దేశపు రక్షణ దళాలే వేటాడటం స్టార్ట్ చేస్తాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి అతను అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్తాడు.

Advertisement

అక్కడ తోటి సైనికులు కోస్టా వెర్డే ప్రధాని అండతో నడుస్తున్న ‘ఐరన్ లీజియన్’ అనే క్రూరమైన మెర్సెనరీ సైన్యం చేతిలో బందీలుగా చిక్కారని, వారికి బహిరంగ మరణశిక్ష విధించబోతున్నారని బ్రాండన్‌ కు తెలుస్తుంది. తన వారిని రక్షించుకోవడం కోసం బ్రాండన్ రంగంలోకి దిగుతాడు. తన తండ్రి అయిన లెజెండరీ స్నైపర్ థామస్ బెకెట్, నమ్మకస్థుడైన ఏజెంట్ జీరోలతో కలిసి గవర్నమెంట్ చేతిలో చిక్కుకున్న వారిని కాపాడే ప్లాన్ చేస్తాడు.

ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్, బ్యాకప్ లేకుండా, ఎటువంటి సరిహద్దు నిబంధనలు పాటించకుండా ఆ క్రూరమైన ప్రైవేట్ సైన్యం తుక్కురేగ్గొడతారు. దేశం తమపై వేసిన నిందను ఆ స్నైపర్ ఎలా తుడిచేశాడు ? అసలు సొంత దేశమే వాళ్ళను నేరస్థులుగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ? తోటి సైనికులను ఎలా రక్షించారు ? మొదట్లో ఫెయిల్ అయిన ఆ సీక్రెట్ మిషన్ ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ Sniper ఫ్రాంచైజీలో 12వ భాగంగా వచ్చింది ‘స్నైపర్ నో నేషన్’. బెన్ పెట్రీ, చాడ్ మైఖేల్ కాలిన్స్, ర్యాన్ రాబిన్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ మూవీ ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ హెల్ప్ తో చూడవచ్చు. ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాల గురించి వెతుకుతుంటే ఈ మూవీ మీ కోసమే. తెలుగులో లేకపోయినా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగుంటాయి. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాను మాత్రం డోంట్ మిస్.

Read Also: క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×