E-Paper
Advertisement

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్
Advertisement

Romantic Drama: లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అంటే ప్రేమికులకు అగ్ని పరీక్ష లాంటిది. అలా దూరంగా ఉంటూ ఎంతగానో బాధ పడతారు. అలాగే ప్రేమ కూడా మరింత పెరుగుతుంది. మీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటే గనుక ఈ మూవీ మీ కోసమే. కాకపోతే దీన్ని ఫ్యామిలీతో కలిసి చూశారంటే వీపు విమానం మోతే. ఇండియాలో ఇంకా లీగల్ కాని రిలేషన్షిప్ ను ఇందులో చూపించారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ నిక్ నెల్సన్, చార్లీ స్ప్రింగ్ అనే ఇద్దరు అబ్బాయిలది. హైస్కూల్ చివరి రోజుల్లో స్టోరీ మొదలవుతుంది. నిక్ యూనివర్సిటీ సెలెక్షన్ ప్రక్రియలో ఉంటాడు. అతనికి లండన్‌ కు దూరంగా ఉన్న ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు వస్తుంది. అక్కడికి వెళ్తే చార్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేని వీరు, ఈ ‘లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్’ తమ బంధాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో అని లోపల తీవ్రంగా ఆందోళన పడుతుంటారు. గతంలో చార్లీ తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడి ఉంటాడు.

Advertisement

ఈ సినిమాలో నిక్ దూరం కాబోతున్నాడనే భయం అతనిని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లకుండా ఉండటానికి చార్లీ గట్టిగా ప్రయత్నిస్తాడు. తన సమస్యలను నిక్‌పై రుద్దకూడదని, తాను ఒంటరిగా కూడా బలంగా ఉండటం నేర్చుకోవాలని చార్లీ డిసైడ్ అవుతాడు. స్కూల్‌ లో హెడ్ బాయ్‌ గా బాధ్యతలు స్వీకరించి, తనలోని నాయకత్వ లక్షణాలను బయటకు తీస్తాడు. ఈ కథ కేవలం నిక్-చార్లీలదే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ కథ కూడా.

టావ్, ఎల్లే ఒక గొప్ప ఆర్ట్ స్కూల్‌ లో చదవడానికి వెళ్తారు. తారా, డార్సీ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ, ఇండిపెండెంట్ గా లైఫ్ ను ప్లాన్ చేసుకుంటారు. యూనివర్సిటీలు ప్రారంభమయ్యే ముందు, ఈ స్నేహితుల బృందం అంతా కలిసి చివరగా ‘రోడ్ ట్రిప్’ సమ్మర్ క్యాంప్‌ ను ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళంతా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఒకరికొకరు ఎప్పటికీ తోడుంటామని ప్రమాణం చేసుకుంటారు.

Advertisement

నిక్, చార్లీలు కలిసి గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో అమూల్యంగా మార్చుకుంటారు. మరి నిక్, చార్లీ దూరమయ్యారా లేదంటే కలిసే ఉన్నారా ? చివరికి ఎలా ఒకరికొకరు వీడ్కోలు పలికారు ? ఎమోషనల్‌గా ఉండే ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

టీనేజ్ ప్రేమ నుంచి యువకుల ప్రయాణం వరకు సాగిన రొమాంటిక్ ‘హార్ట్‌స్టాపర్ ఫరెవర్’. ప్రేమ అంటే కేవలం హృదయాలు కలవడం కాదు… దూరాలను అధిగమించడం, భయాలను ఎదుర్కోవడం, కలిసి ఎదగడం అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ఈ సినిమాను చూస్తే. బ్రిటీష్ టీన్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ‘హార్ట్‌స్టాపర్’కు ముగింపుగా వచ్చిన ఈ సినిమా Netflixలో జూలై 17న విడుదలైంది. ఈ సినిమా తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

Read Also: బిజీ మార్కెట్ లో మహిళ దారుణ హత్య… రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×