E-Paper
Advertisement

Social drama OTT: తల్లి ఒకరితో, కూతురు మరొకరితో… ఇది మామూలు కథ కాదు

Social drama OTT: తల్లి ఒకరితో, కూతురు మరొకరితో… ఇది మామూలు కథ కాదు
Advertisement

Social drama OTT : యుగాలు మారినా మనుషులు పెట్టుకున్న క్రూరమైన ఆచారాలు మాత్రం మారలేదు. చంద్రమండలాన్ని దాటుతున్న రోజులు ఇవి. అయినా కూడా ఆచారాలు, కులాల పేరుతో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రాజస్థానీ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇది దక్షిణ రాజస్థాన్‌లోని ‘నాతే’ అనే ఒక దారుణమైన వివాహ సంప్రదాయ నేపథ్యంలో సాగుతుంది. ఇది ఒక అద్భుతమైన సోషల్ సినిమా గా చెప్పుకోవచ్చు. తల్లి కూతుర్ల త్యాగాలు కన్నీళ్లు కూడా పెట్టిస్తాయి ఇందులో.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ రాజస్థానీ సోషల్ డ్రామా సినిమా పేరు ‘నాతే’ (Naate). ఇది 2026 ఫిబ్రవరి 20 నుంచి STAGE ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది థియేటర్లలో కాకుండా ఈ సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. సుమారు 1 గంట 31 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమాకి, శ్యామ్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాంక్ష పాల్, రాశికా ప్రధాన్, జైహింద్ కుమార్, శశి రంజన్, దీపక్ బంధు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది రాజస్థానీ భాషతో పాటు భోజ్‌పురి, హర్యాని, గుజరాతీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాజస్థాన్‌లోని ఒక పల్లెటూర్లో జీవీ అనే మహిళ తన కూతురు పింకీతో కలిసి బతుకుతుంటుంది. అయితే అక్కడ ‘నాతా’ అనే ఆచారం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక మహిళను ఆమె మొగుడు వదిలేస్తే, ఆ ఊరి పెద్దలు ఆమెను వేరే వాడికి అమ్మేస్తారు. జీవీని కూడా అలాగే ఒకరి తర్వాత ఒకరికి అప్పగిస్తుంటారు. ఆమెకు నచ్చినా నచ్చకపోయినా, ఆ రాక్షసుల మధ్య ఆమె నలిగిపోతూ ఉంటుంది. కానీ తన కూతురు పింకీని మాత్రం బాగా చదివించి, ఈ ఊరి నుంచి పంపించేయాలని ఆమె ఆరాటపడుతుంది.

ఇక పింకీ స్కూలుకు వెళ్తూ బాగా చదువుకుంటుంది కూడా. కానీ స్కూలు బయట తన తల్లి పడుతున్న అవమానాలు ఆమెను బాగా వేధిస్తుంటాయి. తన తల్లిని ఆ ఊరి జనం ఒక భోగవస్తువులా చూడటం, రాత్రిపూట ఇంటికి వచ్చే వ్యక్తులు పెట్టే చిత్రహింసలు పింకీ కళ్లారా చూస్తుంది. తన తల్లిని ఈ నరకం నుంచి బయటపడేయాలని ఆ చిన్న ప్రాణం తల్లడిల్లిపోతుంది. మరోపక్క, ఊరి పెద్దలు పింకీ మీద కూడా కన్నేస్తారు. ఆమెకు కూడా త్వరగా పెళ్లి చేసేసి, ఆ పేరుతో మళ్ళీ డబ్బులు దండుకోవాలని చూస్తారు.

Advertisement

కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. జీవీ పడుతున్న కష్టాలు తట్టుకోలేక, పింకీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తన తల్లిని ఈ ‘నాతా’ నుంచి విముక్తి చేయాలంటే, తాను బలి కావాలని నిర్ణయించుకుంటుంది. జీవీ తన కూతురుని చదివించాలని చూస్తే, పింకీ మాత్రం తన చదువు ఆపేసి, ఊరి పెద్దలు చెప్పిన బాల్య వివాహానికి ఒప్పుకుంటుంది. చివరికి పింకీ వివాహం చేసుకుని ఆ నరకంలోకి వెళ్తుందా ? తన తల్లికి విముక్తి కలిగిస్తుందా ? ఈ క్లైమాక్స్ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×