E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును బెదిరించిన ఇందు  

Brahmamudi Serial Today march 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును బెదిరించిన ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode:   

స్వాతి బట్టలు తీసుకొచ్చి ఇందుకు ఇస్తుంది. ఇందు ఏంటి స్వాతి ఇవి అని అడగ్గానే.. కనిపించడం లేదా..? నా బట్టలు అని చెప్పగానే.. ఏంటి ఇంత కాస్లీ బట్టలు నీకు ఇవ్వాలా..? అది మీ రేఖ ఆంటీ నాకోసం ఇచ్చిన బట్టలు.. అని చెప్పగానే.. ఇందు నేనేం చేయాలి ఉతికి ఇస్త్రీ చేయాలా..? అని అడగ్గానే.. లేదు టైలర్‌ దగ్గరకు తీసుకెళ్లి కుట్టించి తీసుకురావాలి అని చెప్పగానే.. ఇందు అమాయకంగా నేనా అని అడుగుతుంది. దీంతో మరి నేనా..? ఏ ఆ మాత్రం పని కూడా చేయవా..? కందిపోతావా..? అని అడగ్గానే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.. భ్రమరాంబ మాత్రం సంతోషంగా అబ్బా ఎంత కాలానికి నువ్వు నా దారికి వచ్చావే ఇన్ని రోజులు అక్కా అక్కా అంటూ నువ్వు దీని వెంట తిరుగుతుంటే నాకు మహా చెడ్డ చిరాకు వచ్చేది. ఇప్పుడు నువ్వు దీనికి పని చెప్తుంటే చూడముచ్చటగా ఉంది. సడెన్‌ గా నీలో ఈ మార్పు ఏంటే.. అని అడగ్గానే..

ఎవరిని ఎక్కడ పెట్టలో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అమ్మ అని చెప్తుంది స్వాతి. దీంతో భ్రమరాంభ ఇప్పుడు కరెక్టుగా చెప్పావే… ఇప్పుడు నువ్వు నా కూతురువి అనిపించుకున్నావు.. నువ్వేంటే ఇంకా అలా చూస్తున్నావు.. నా కూతురు చెప్పింది కదా..? వెళ్లి కుట్టించుకురా..? అని భ్రమరాంబ కోపంగా చెప్పగానే.. ఇందు అమాయకంగా అది నేను బయటకు వెళ్లకూడదని రేఖ ఆంటీ కండీషన్‌ పెట్టింది కదా పిన్ని అంటుంది. దీంతో భ్రమరాంబ అవును కదా అంటుంది. ఇంతలో స్వాతి.. అంటే ఏంటమ్మా.. నా బట్టలు నేనే కుట్టించుకోవాలా..? నా పనులు కూడా చేయరా ఇంట్లో ఏం నాకు ఆ రైట్స్‌ కూడా లేవా..? సరే నాకంటే లేవు నీక్కూడా లేవా..? అని స్వాతి ప్రశ్నించగానే.. భ్రమరాంబ ఉంది ఉన్నాయి.. ఎందుకు లేవు.. అంటుంది. దీంతో స్వాతి మరైతే వెళ్లమని చెప్పు అనగానే.. భ్రమరాంబ ఏయ్ నేను చెప్తున్నాను కదా వెళ్లు.. అంటుంది.

Advertisement

ఇందు అనుమానంగా అది పిన్ని ఆంటీ.. అంటుంటే.. భ్రమరాంభ కోపంగా ఏయ్‌ నేను చెప్తున్నాను కదా వెళ్లు.. అని చెప్పగానే.. ఇందు నడుచుకుంటూ వెళ్లనా..? అని అడగ్గానే.. స్వాతి కల్పించుకుని అమ్మ తల్లి నువ్వు నడుచుకంటూ వెళ్లి బట్టలు కుట్టించుకుని వచ్చే సరికి తెల్లారిపోతుంది. డ్రైవర్‌ను తీసుకెళ్లు.. అనగానే.. భ్రమరాంబ కరెక్టుగా చెప్పావు.. శ్రీను.. శ్రీను అని పిలవగానే డ్రైవర్‌ చెప్పండి మేడం అంటూ బయటి నుంచి వస్తాడు. దీంతో భ్రమరాంభ దీన్ని టైలర్‌ దగ్గరకు తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా..? దారిలో ఎక్కడా దింపకు అని చెప్తుంది…

దీంతో స్వాతి ఏంటి ఇంకా చూస్తున్నావు.. టైం అవుతుంది వెళ్లు అని చెప్పగానే.. భ్రమరాంభ అనుమానంగా ఆ టైం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో స్వాతి.. అదేనమ్మా..? తిరిగి రావడానికి ఆలస్యం అవుతుందని అంటున్నాను.. అని చెప్పగానే.. అవును అవును త్వరగా వెళ్లి రా..? అని భ్రమరాంభ చెప్పగానే.. ఇందు, అపర్ణ దగ్గరకు వెళ్లి నేను వెళ్లి వస్తాను నాన్నమ్మ అని చెప్పగానే.. అపర్ణ ఆల్ ది బెస్ట్‌ నాన్న అని చెప్తుంది. అంతా గమనిస్తున్న భ్రమరాంభ ఏయ్‌ అది ఏమైనా యుద్దానికి వెళ్తుందా..? అంత ఓవరాక్షన్‌ చేస్తున్నావు..అది వెళ్లేది టైలర్‌ దగ్గరకే కదా..? అని చెప్పగానే.. స్వాతి కోపంగా ఓసేయ్‌ ఇందు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయ్‌ అని చెప్తుంది. సరే అంటూ ఇందు వెళ్లిపోతుంది…

Advertisement

కారులో వెళ్తున్న ఇందుకు ఎదురుగా బైక్‌ మీద రాజు వస్తాడు… కారు తనకు తగలకపోయినా తగిలినట్టు బిల్డప్‌ ఇస్తాడు. రచ్చ రచ్చ చేస్తాడు. ఇందు కారు దిగి వచ్చి రాజును పోలస్‌ స్టేషన్‌కు వెళ్దామని భయపెడుతుంది. కారు డాష్‌బోర్డు కెమెరాలో అంతా రికార్డు అయిందని చెప్తుంది. దీంతో రాజు భయపడతాడు. అక్కడి నుంచి పారిపోతుంటే.. ఇందు రాజుకు వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తుంది. తర్వాత ఎగ్జామ్‌ హాల్‌కు వెళ్తుంది. అక్కడ ఐశ్వర్యను చూసి షాక్‌ అవుతుంది. తర్వాత మాస్క్‌ పెట్టుకుని ఎగ్జామ్‌ రాస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×