E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది – వారికి పనుల్లో అంతరాయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది – వారికి పనుల్లో అంతరాయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 2వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. 

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వాహన యోగం ఉన్నది సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. 

మిథునం

ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి.

కర్కాటకం

Advertisement

నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.  ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం

ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

కన్య

నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి.  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం

వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

ధనుస్సు

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.

మకరం

దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.  

కుంభం

 ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది.  పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం

ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×