E-Paper
Advertisement

South Thrillers OTT : కేక పెట్టించే కన్నడ సినిమాల నుంచి అచ్చ తెలుగు ఆణిముత్యాల వరకు… ఓటీటీలో ఉన్న బెస్ట్ థ్రిల్లర్స్ ఇవే

South Thrillers OTT : కేక పెట్టించే కన్నడ సినిమాల నుంచి అచ్చ తెలుగు ఆణిముత్యాల వరకు… ఓటీటీలో ఉన్న బెస్ట్ థ్రిల్లర్స్ ఇవే
Advertisement

South Thrillers OTT : ఈ ఓటీటీ యుగంలో థ్రిల్లర్ చిత్రాలకు ఎక్కువగా క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో స్పై థ్రిల్లర్ “ధురంధర్” థియేటర్లలో దుమ్మురేపింది. అద్భుతమైన కథ, పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టిన నటీనటులతో ఈ మూవీ 2025లో వచ్చిన అగ్ర చిత్రాలలో ఒకటిగా మారింది. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భేష్ అన్పించుకుంది. కాబట్టి మీరు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మంచి థ్రిల్ ఇచ్చే సినిమా చూడాలని ప్లాన్ చేస్తుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. అలాగే సౌత్ లో రూపొందిన కొన్ని బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

Jai Bhim

ఈ థ్రిల్లర్ చిత్రాల జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది సూర్య కోర్ట్ రూమ్ డ్రామా “జై భీమ్”. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంవహించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు ప్రకాష్ రాజ్ కూడా నటించారు. అన్యం పుణ్యం ఎరుగని గిరిజన ప్రజల భూమి హక్కుల కోసం పోరాడే న్యాయవాది చుట్టూ తిరుగుతుంది “జై భీమ్” కథ. దీనిని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊహించని ట్విస్టులు ఉంటాయి.

Rangi Taranga

Advertisement

ఆ లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ “రంగి తరంగ”. అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ త్రిల్లర్ 2015లో తెరపైకి వచ్చింది. సినిమాలో ఒక రచయిత, అతని భార్య తమ పూర్వీకుల గ్రామానికి తిరిగి వెళతారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ? అన్నది చూడాల్సిందే. ఉత్కంఠభరితమైన ట్విస్ట్ లతో ఈ మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం సన్ నెక్స్ట్, యూట్యూబ్‌ లో అందుబాటులో ఉంది .

Agent Sai Srinivasa Athreya

ఇక ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఈ చిత్రానికి స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఒక డిటెక్టివ్ చుట్టూ తిరిగే ఈ మూవీ 2019లో విడుదలైంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Chithha

Advertisement

అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా “చిత్త”. ‘చిన్నా’ అనే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. చనిపోయిన అన్న కూతురిని తన సొంత కూతురిలా చూసుకుంటాడు హీరో. కానీ ఆ బిడ్డ మిస్ అయినప్పుడు అసలు ట్విస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఊహించని మలుపులతో కథ నడుస్తుంది. సిద్దార్థ హీరోగా నటించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

kaithi

థ్రిల్లర్ మూవీస్ లో మరో జెమ్ “కైతి”. ఈ తమిళ మూవీని తెలుగులో ‘ఖైదీ’ పేరుతో రిలీజ్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కథ మొత్తం ఒకే రాత్రిలో జరుగుతుంది. క్లైమాక్స్ వరకు మైండ్ బెండయ్యే ట్విస్టులు ఉంటాయి. ఈ చిత్రంలో కార్తీ ట్రక్ డ్రైవర్ పాత్లో కనిపిస్తాడు. దీన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

Read Also : 17 మంది స్టార్స్, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన మూవీ… కట్ చేస్తే కల్ట్ హిట్… ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×