E-Paper
Advertisement

Psycho Thriller OTT : 17 మంది స్టార్స్, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన మూవీ… కట్ చేస్తే కల్ట్ హిట్… ఏ ఓటీటీలో ఉందంటే?

Psycho Thriller OTT : 17 మంది స్టార్స్, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన మూవీ… కట్ చేస్తే కల్ట్ హిట్… ఏ ఓటీటీలో ఉందంటే?
Advertisement

Psycho Thriller OTT : హీరో, దర్శక నిర్మాతలతో సహ ప్రతీ ఒక్కరి అంచనాలను తలక్రిందులు చేసేదే సినిమా. సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడొచ్చు. డిజాస్టర్ అనుకున్న మూవీ సూపర్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మూవీ రిజల్ట్ ఆడియన్స్ మూడ్, కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. అయితే సినిమాల రిజల్ట్ ఏమైనప్పటికీ కొన్నిసార్లు మంచి సినిమాలను జారవిడుచుకుంటారు హీరోలు. ఆ తరువాత బాధ పడతారు. ఇప్పటిదాకా ఇలాంటి వార్తలు ఎన్నో విన్నాము. కానీ ఈరోజు మాత్రం 17 మంది నటులు రిజెక్ట్ చేసిన ఒక కల్ట్ మోవి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంతేనా ఈ సినిమాను 21 మంది నిర్మాతలు నిర్మాతలు కూడా నిర్మించడానికి ఒప్పుకోలేదట. ఇంతకీ ఈ మూవీ పేరేంటి ? ఈ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అంతమంది ఎందుకు రిజెక్ట్ చేశారంటే ?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కథ మొత్తం 17 మంది ప్రముఖు నటుల దగ్గరకు వెళ్ళిందట. స్టోరీ డార్క్ థీమ్ తో ఉండడంతో వీళ్ళంతా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. అలాగే ఏకంగా 21 మంది నిర్మాతలు ఈ మూవీని నిర్మించడానికి ఆసక్తిని కనబరచలేదట. చివరకు థియేటర్లలోకి వచ్చే వరకు ఈ సినిమాకు అవే కష్టాలు. ఎలాగోలా ఒక హీరోను, నిర్మాతను పట్టుకుని దర్శకుడు సినిమాను పూర్తి చేశాడు. కథపై ఉన్న నమ్మకంతో థియేటర్లలో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కట్ చేస్తే ఆ మూవీకి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. అంతేకాదు ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లోనే ఒక కల్ట్ క్లాసిక్‌ గా నిలిచిపోయింది.

Advertisement

Read Also :  ఒక్క ఓటీటీ కూడా కొనని వెబ్ సిరీస్… దానికోసమే ప్రత్యేకంగా వెబ్ సైట్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

ఏ ఓటీటీలో ఉందంటే ?

మనం చెప్పుకుంటున్నది 2018లో విడుదలైన ‘రాట్ససన్’ అనే సినిమా గురించే. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమలా పాల్, సంగిలి మురుగన్, రాధా రవి, నిజాల్గల్ రవి, కాళి వెంకట్, మునిష్కాంత్, వినోద్ సాగర్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం. ఇప్పటికీ మూవీని చూస్తున్న వారికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది.

Advertisement

ఈ చిత్రంలో మహిళలపై జరిగే నేరాలను ప్రధాన అంశంగా తీసుకున్నారు. క్లైమాక్స్ అయితే కేక పెట్టిస్తుంది. ఇప్పటికీ ప్రేక్షకులు సినిమా ప్రారంభం నుండి చివరి వరకు తమ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది ఈ మూవీ. విలన్ బహుమతులను ఉపయోగించి ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత వాళ్ళ ముఖాన్ని పాడు చేసి మర్డర్ కూడా చేస్తాడు. చివరకు హీరో ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు ? అనేది సినిమాలో చూస్తే మైండ్ బెండవ్వడం ఖాయం. ఈ మూవీ థ్రిల్లర్ ప్రియులకు ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది. ఇలా క్రైమ్ థ్రిల్లర్‌లను ఆస్వాదించే ప్రేక్షకులకు తమిళ సినిమాలో ఇదొక తిరుగులేని మైలురాయిగా మిగిలి చరిత్రను సృష్టించింది. ఈ మూవీ ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×