E-Paper
Advertisement

Space Gen – Chandrayaan OTT : ఓటీటీలోకి భారతదేశం చంద్రునిపైకి చేసిన చారిత్రాత్మక ప్రయాణం… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Space Gen – Chandrayaan OTT : ఓటీటీలోకి భారతదేశం చంద్రునిపైకి చేసిన చారిత్రాత్మక ప్రయాణం… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Space Gen – Chandrayaan OTT : స్పేస్ కు సంబంధించిన అంశాలను తెలుసుకోవడంపై ప్రతీ ఒక్కరికీ ఊహించలేనంత క్యూరియాసిటీ, పట్టలేనంత ఎగ్జైట్మెంట్ ఉంటాయి. వాళ్ళూ, వీళ్ళు చెప్పడమో, లేదా పేపర్లో, న్యూస్ చానల్స్ లో చూసి తెలుసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ షోతో కళ్ళారా అంతరిక్షం, దానికి సంబంధించి భారత్ చేసిన ఓ అద్బుతమైన ప్రయోగాన్ని చూసే ఛాన్స్ రాబోతోంది.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి అయిన ‘స్పేస్ జెన్ – చంద్రయాన్’ (Space Gen – Chandrayaan) పేరుతో ఒక ఎక్సైటింగ్ షో జనవరి 2026లో రిలీజ్ అవుతోంది. ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మించిన ఈ సిరీస్ ఇస్రో (ISRO) చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో భారత సైంటిస్టుల డెడికేషన్, చంద్రుడి మిస్టరీలు, టెక్నికల్ చాలెంజెస్ బాగా చూపిస్తారని ఆశిస్తున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించి చేసిన పోస్ట్ సైన్స్ ఫీవర్ రేపుతుంది. ఇస్రో సక్సెస్ స్టోరీలు స్క్రీన్‌పై చూడటం నిజంగానే ఎక్సైటింగ్ గా ఉంటుంది మరి.

చంద్రయాన్ మిషన్లు

భారత్ స్పేస్ జర్నీచంద్రయాన్ ప్రోగ్రామ్ ఇస్రో చేపట్టిన భారీ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి చేసిన మూడు మిషన్లు భారత్‌ ను స్పేస్ పవర్‌ గా నిలబెట్టాయి. మొదటి మిషన్ చంద్రయాన్-1 (2008)లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరిగి, చంద్రుపై నీటి ఆనవాళ్లు కనుగొన్నది. NASAతో కలిసి M3 ఇన్‌స్ట్రుమెంట్ ఉపయోగించి, పోలార్ రీజియన్లలో వాటర్ మాలిక్యూల్స్ డిటెక్ట్ చేశారు. ఇది స్పేస్ సైన్స్‌లో బిగ్ బ్రేక్‌త్రూ.

తర్వాత చంద్రయాన్-2 (2019) మరింత యాంబిషస్. ఇది ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో వచ్చింది. ఆర్బిటర్ సక్సెస్ అయినా, ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. కానీ మిషన్ వల్ల చంద్రుడి సర్ఫేస్ మ్యాపింగ్, మినరల్ డిటెక్షన్ లాంటి డేటా వచ్చింది.

ఇక చంద్రయాన్-3 (2023) అసలు గేమ్ చేంజర్. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, ప్రజ్ఞాన్ రోవర్ మోహరించింది. మొదటిసారిగా సౌత్ పోల్ ను ఎక్స్‌ప్లోర్ చేసి, సల్ఫర్, మిగతా ఎలిమెంట్స్ డిటెక్ట్ చేశారు. ఇది భారత్‌ ను స్పేస్ సూపర్ పవర్‌ గా నిలబెట్టింది.

ఇస్రో విషయానికొస్తే… భారత స్పేస్ పవర్ హౌస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO). దీన్ని విక్రమ్ సారాభాయ్ విజన్‌ తో 1969లో స్థాపించారు. స్పేస్ డిపార్ట్‌మెంట్ (DOS) కింద పని చేస్తుంది. హెడ్‌క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. కాస్ట్ ఎఫెక్టివ్ మిషన్లకు ఫేమస్ ఇస్రో. చంద్రయాన్, మంగళయాన్ (మార్స్ మిషన్ – ఫస్ట్ అటెంప్ట్‌లో సక్సెస్) లాంటివి ఇందులోనే చేశారు. సాటిలైట్ లాంచెస్, కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ (NavIC), వెదర్ ఫోర్‌కాస్టింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది. 100కి పైగా సాటిలైట్స్ లాంచ్ చేసి, ఇండియా స్పేస్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చింది.

ఈ షో ఎందుకు చూడాలి?

స్పేస్ జెన్ – చంద్రయాన్ ISRO సైంటిస్టుల డెడికేషన్, చాలెంజెస్, సక్సెస్ స్టోరీలు చూపిస్తుంది. యంగ్ జెనరేషన్‌కి ఇన్‌స్పిరేషన్, సైన్స్ ఫ్యాన్స్‌కి ట్రీట్. జనవరి 2026లో జియో హాట్‌స్టార్‌లో వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. మన స్పేస్ హిస్టరీని సెలబ్రేట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ షో.

Read Also :  ‘వెల్కం టు డెర్రీ’ టు ‘సిన్నర్స్’ వరకు.. 2025లో జియో హాట్‌స్టార్‌లో సంచలనం సృష్టించిన సినిమాలు, సిరీసులు

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×