E-Paper
Advertisement

Year Ender 2025 : ‘వెల్కం టు డెర్రీ’ టు ‘సిన్నర్స్’ వరకు.. 2025లో జియో హాట్‌స్టార్‌లో సంచలనం సృష్టించిన సినిమాలు, సిరీసులు

Year Ender 2025 : ‘వెల్కం టు డెర్రీ’ టు ‘సిన్నర్స్’ వరకు.. 2025లో జియో హాట్‌స్టార్‌లో సంచలనం సృష్టించిన సినిమాలు, సిరీసులు
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కానీ ఈ ఏడాది మనకు ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్‌లు ఇచ్చింది. జియోహాట్‌స్టార్ లో ఈ ఏడాది వచ్చిన కొన్ని పెద్ద హిట్స్ థియేటర్లలో కూడా సంచలనం సృష్టించాయి. ‘లోకా చాప్టర్ 1: చంద్ర’లాంటి ఇండియన్ బ్లాక్‌బస్టర్‌లు, అలాగే హాలీవుడ్ నుండి వచ్చిన ‘ఐటి’ ఫ్రాంచైజీకి సంబంధించిన ‘వెల్‌కమ్ టు డెర్రీ’ వంటివి ఓటీటీని ఊపేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టాప్ 10 సినిమాలు, సిరీస్ లు బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కురిపించడమే కాకుండా, స్ట్రీమింగ్ వ్యూస్‌లో కూడా రికార్డులు సృష్టించాయి. మరి ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలు సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. వెల్‌కమ్ టు డెర్రీ (Welcome to Derry)

బిల్ స్కార్స్‌గార్డ్ నటించిన ‘ఐటి’ మూవీ ఫ్రాంచైజీకి ఈ సంవత్సరం సిరీస్ రూపంలో కొత్త అధ్యాయం వచ్చింది. 2017, 2019 సినిమాలకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఇది, పెన్నీవైస్ క్లౌన్ మూలాలను 1960ల నేపథ్యంలో చూపిస్తుంది. మేజర్ హాన్లాన్, పిల్లలు వంటి పాత్రల ద్వారా డెర్రీ పట్టణంలోని దుష్ట శక్తులను తెరపైకి తీసుకొచ్చారు. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ హారర్ ఫ్యాన్స్‌కి ఒక ట్రీట్.

2. ది పిట్ (The Pit)

Advertisement

నోహ్ వైల్ నిర్మించిన ఈ మెడికల్ డ్రామా 2025లో 5 ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది. అదిరిపోయే స్టోరీతో, రియల్-టైమ్ ఫార్మాట్‌ లో రూపొందింది. ప్రతి ఎపిసోడ్ డాక్టర్లు, స్టాఫ్ 15 గంటల ER షిఫ్ట్‌లో ఎంత కష్టపడతారో చూపిస్తుంది. ఇంటెన్స్ సీన్స్, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేసింది. జియోహాట్‌స్టార్‌లో దీనికి భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

3. హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon)

2010 యానిమేటెడ్ మూవీకి లైవ్-యాక్షన్ వెర్షన్ ఇది. గెరార్డ్ బట్లర్ స్టోయిక్ ది వాస్ట్ పాత్రలో మళ్లీ నటించాడు. హిక్కప్, టూత్‌లెస్ మధ్య బంధం, అడ్వెంచర్, ఎమోషన్స్‌తో నిండిన ఫాంటసీ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా 636 మిలియన్లు, ఇండియాలో రూ.30.34 కోట్లు సంపాదించింది ఈ మూవీ. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

4. డేర్‌డెవిల్: బోర్న్ అగైన్ (Daredevil: Born Again)

Advertisement

ఈ మార్వెల్ సిరీస్ 2015 డేర్‌డెవిల్ కథను కొనసాగిస్తుంది. చార్లీ కాక్స్ మాట్ ముర్డాక్ (డేర్‌డెవిల్) పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. చిన్నప్పుడు రేడియో యాక్టివ్ ప్రమాదంలో కళ్లు పోగొట్టుకున్న సూపర్‌ హీరో MCU ఫ్యాన్స్‌ని బాగానే అలరించాడు.

5. సిన్నర్స్ (Sinners)

మైఖేల్ బి. జోర్డాన్ డైరెక్ట్ చేసి నటించిన హారర్-థ్రిల్లర్ ‘సిన్నర్స్’. తీవ్ర హింస, అసభ్య భాష, పెద్దల కంటెంట్ వల్ల A రేటింగ్ తెచ్చుకున్న ఈ మూవీ ఆడియన్స్ పై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జియోహాట్‌స్టార్‌లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలతో పాటు ‘లోకా చాప్టర్ 1: చంద్ర’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘తుడరుమ్’, ‘సు ఫ్రమ్ సో’ వంటి సౌత్ ఇండియన్ సినిమాలు కూడా హాట్ స్టార్ లో హయ్యెస్ట్ వ్యూస్ కొల్లగొట్టాయి.

Read Also :  2026లో సై-ఫై హర్రర్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’కు ఎండ్ కార్డు… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×