E-Paper
Advertisement

Road Accident: లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. నల్గొండ హైవేపై ఘటన, హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు

Road Accident: లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. నల్గొండ హైవేపై ఘటన, హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు
Advertisement

Road Accident: ఏడాది చివరలో కూడా రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వేగంగా వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘటన

Advertisement

ఓ వైపు అతి వేగం, మరోవైపు పొగ మంచు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఘటన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు.. లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

వెంటనే వారిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు నార్కట్‌పల్లి వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో మేడ్చల్‌ ప్రాంతానికి చెందిన రామప్రభు, అనఘ ఉన్నారు.

Advertisement

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు

మంగళవారం రాత్రి హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో ట్రాఫిక్ హోమ్ గార్డుని ఢీ కొట్టింది ఓ కారు. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరరాయ్యాడు. సిగ్నల్ వద్ద నిలబడ్డాడు ట్రాఫిక్ హోం గార్డు నయూం. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు, హోంగార్డుని ఢీ కొట్టింది. వెంటనే హోంగార్డుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ:  స్టాక్ మార్కెట్ ఆశ చూపి నిండా ముంచారు.. చివరకు ఏమైందంటే

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×