E-Paper
Advertisement

Spy Thriller Series OTT : ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్ ఆగిపోలేదా ? క్రేజీ అప్డేట్ ఇచ్చిన గ్లోబల్ బ్యూటీ

Spy Thriller Series OTT : ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్ ఆగిపోలేదా ? క్రేజీ అప్డేట్ ఇచ్చిన గ్లోబల్ బ్యూటీ
Advertisement

Spy Thriller Series OTT : రాజమౌళి వారణాసి సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏదో ఒక విషయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఆమె ఊరికే అలా కనిపించినా సరే ట్రెండింగ్ లోకి వస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన పాపులర్ సిరీస్ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే ఆగిపోయింది అనుకున్న సిరీస్ మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది అంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ప్రియాంక ఏ సిరీస్ గురించి మాట్లాడిందో తెలుసుకుందాం పదండి.

ప్రియాంక కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2023లో విడుదలైన అమెరికన్ స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ (Citadel) ఇది ఒక గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్, రస్సో బ్రదర్స్ (Avengers ఫేమ్) ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. సిరీస్ ఒక గ్లోబల్ స్పై ఏజెన్సీ ‘సిటాడెల్’ చుట్టూ తిరుగుతుంది. ఇందులో మెమరీలు కోల్పోయిన ఏజెంట్లు, శక్తివంతమైన శత్రువులు, హై-స్టేక్స్ మిషన్‌లు ఉన్నాయి. మొదటి సీజన్ 6 ఎపిసోడ్‌లతో వచ్చింది. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ అత్యంత ఖరీదైన ఓటీటీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. సుమారు $300 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇది అమెరికా, ఇటలీ, ఇండియా వంటి దేశాలలో స్పిన్-ఆఫ్ సిరీస్‌లను కూడా తెచ్చింది.

Advertisement

గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా ఈ సిరీస్‌లో నదియా అనే స్పై ఏజెంట్ పాత్రలో నటించింది. మెమరీ కోల్పోయిన స్పైగా, తన గతాన్ని వెతుకుతూ శత్రువులతో పోరాడుతుంది. ఇందులో ప్రియాంక యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగ సీన్స్ అద్భుతంగా చేసింది. సిరీస్ విడుదలైన తర్వాత ప్రియాంకకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. సిటాడెల్ సక్సెస్ ప్రియాంక హాలీవుడ్ కెరీర్‌ ను మరింత స్ట్రాంగ్ గా చేసింది. రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుచి వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో నటించారు. సిరీస్ చాలా దేశాలలో టాప్ 10లోకి వచ్చింది.

Read Also : చెల్లిని కాపాడుకోవడానికి అక్క ఊచకోత… ఒక్కొక్కడిని పరిగెత్తించి… అల్టిమేట్ యాక్షన్ సీన్స్ తో కాటేరమ్మ జాతర

స్పిన్-ఆఫ్ సిరీస్‌లు, రద్దు ప్రకటన

Advertisement

‘సిటాడెల్’ గ్లోబల్ స్పిన్-ఆఫ్ సిరీస్‌లను తీసుకొచ్చారు మేకర్స్. ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో సమంతా రూత్ ప్రభు, వరుణ్ ధావన్ నటించారు. ఇటాలియన్ వెర్షన్ ‘సిటాడెల్: డయానా’లో మటిల్డా డి ఏంజెలిస్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ రెండు సిరీస్‌లకు మంచి రివ్యూలు వచ్చాయి. కానీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘సిటాడెల్: డయానా’ తదుపరి సీజన్‌లను రద్దు చేసింది. రద్దు కారణాలు అధికారికంగా చెప్పలేదు కానీ బడ్జెట్ ఇష్యూస్, వ్యూవర్‌షిప్ కంటే ఖర్చు ఎక్కువ అవ్వడం కావచ్చు అనేది సినీ విశ్లేషకులు చెప్పే మాట. ఈ రద్దు ప్రకటన తర్వాత అసలు ‘సిటాడెల్ సీజన్ 2’ ఉంటుందా లేదా అనే చర్చలు మొదలయ్యాయి.

సీజన్ 2పై ప్రియాంక చోప్రా స్పందన

తాజాగా ‘సిటాడెల్ సీజన్ 2’ గురించి జప్రియాంక చోప్రా స్పష్టమైన ప్రకటన చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘సిటాడెల్ 2’ ఉందని, త్వరలోనే మేము షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం అని చెప్పడం అభిమానులలో ఉత్సాహాన్ని రేపింది. సీజన్ 2లో మరిన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, కొత్త పాత్రలు, మరిన్ని దేశాలలో సెట్టింగ్‌లు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి.

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×