E-Paper
Advertisement

Mrutyunjay OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శ్రీ విష్ణు మృత్యుంజయ్..ఎప్పుడంటే!

Mrutyunjay OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శ్రీ విష్ణు  మృత్యుంజయ్..ఎప్పుడంటే!
Advertisement
Mrutyunjay OTT: ఇటీవల సినిమాలన్నీ థియేటర్లో విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోని తిరిగి ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయిందని చెప్పాలి. ఇక ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి నెలలో శ్రీ విష్ణు హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన విష్ణు విన్యాసం అనే సినిమా ఫిబ్రవరి 27వ తేదీ విడుదల అయింది అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజులకే అనగా మార్చి ఆరో తేదీ మృత్యుంజయ్ (Mrutyunjay)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ గా మృత్యుంజయ్..

శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం కాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన తెలియజేశారు.మార్చి 6,  థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించగా, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ మూవీకి  ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు.

నెట్ ఫ్లిక్స్ లోకి మృత్యుంజయ్..

ఇలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా పూర్తికాకుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మొత్తం హత్యల వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
జయ్ (శ్రీవిష్ణు) ఓ పేపర్ యాడ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. కానీ అతనికి ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంతుంటారు కానీ అతనికి మాత్రం ఆ అవకాశం రాలేదు . దీంతో ఇష్టం లేకపోయిన జయ్ యాడ్ విభాగంలోనే కొనసాగుతూ ఉంటారు. ఇక ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలికి సంబంధించిన ప్రకటనలను సంపాదిస్తూ చనిపోయిన వారి గురించి గొప్పగా చెబుతుంటాడు అయితే ఒకసారి అచ్యుత్ రావు (బాలాదిత్య) మరణిస్తాడు. వాళ్ల ఇంటికి వెళ్లడంతో అచ్యుత్ రావు కూతురు ఏడుస్తూ తన తండ్రికి ఏమైందని అడగగా జయ్ నేను తెలుసుకుంటానని చెబుతారు. అయితే కొద్ది రోజులకు అచ్చం అచ్యుత్ రావు లాగానే మరొకరు మరణిస్తారు. దీంతో ఈ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడం కోసం జయ్ రంగంలోకి దిగుతారు. మరి ఈయన ఈ చావులకు గల కారణాలను తెలుసుకున్నారా? చావుల వెనుక ఉన్నది ఎవరు? ఈ మిస్టరీని కనుక్కొని క్రైమ్ రిపోర్టర్ కావాలనే కల జయ్ నెరవేర్చుకున్నారా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Related News

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

Big Stories

Advertisement
×