E-Paper
Advertisement

బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్ర్యమా… హీరోయిన్ కు మాధురి కౌంటర్!

బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్ర్యమా… హీరోయిన్ కు మాధురి కౌంటర్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి (Divvala Madhuri)పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైన మహిళల వస్త్రధారణ గురించి కూడా ఈ సందర్భంగా మాధురికి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష మాట్లాడుతూ..

శివాజీ గారికి నా మద్దతు తెలిపాను..

డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకు లిమిట్స్ ఉండాలా? లేదంటారా? అనే ప్రశ్న ఎదురవడంతో మాధురి సమాధానం చెబుతూ కచ్చితంగా అమ్మాయిలకు డ్రెస్సింగ్ విషయంలో లిమిట్స్ ఉండాలని, ఈ విషయంలో నేను శివాజీ(Sivaji) గారికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో కూడా చేశానని మాధురి తెలిపారు. మనం వేసుకుని బట్టలను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని నేను చెప్పను కానీ మనకంటూ సెక్యూరిటీ ఉండటం అలాగే సౌకర్యంగా లేని బట్టలను వేసుకెళ్లి అందరూ చూస్తుండగా సర్దుకోవడం కంటే నిండుగా దుస్తులు వేసుకొని వెళ్లడం మంచిదని మాధురి తెలిపారు.

అర్థనగ్నంగా బట్టలు వేసుకుంటే వంకరగానే చూస్తారు..

Advertisement

అమ్మాయిలకు అందం అనేది ఎక్స్పోజింగ్ చేస్తే రాదని, నిండుగా బట్టలు వేసుకున్నప్పుడే అమ్మాయిలకు అందం రెట్టింపు అవుతుందని మాధురి తెలిపారు. మనం ఎప్పుడైతే నిండుగా దుస్తులు ధరిస్తామో అప్పుడే మనం బయటకు వెళ్లిన చాలా గౌరవం ఉంటుందని అలా కాకుండా అర్థనగ్నంగా బట్టలు వేసుకొని వెళ్తే అబ్బాయిలు వంకరగానే చూస్తారు అంటూ మాధురి తెలిపారు. అది అబ్బాయిల తప్పు కాదని అది వారి హార్మోనల్ సమస్య అని మాధురి తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇంట్లో మనం షార్ట్ వేసుకుంటే మన అన్నకు నాన్నకు అలాంటి ఫీలింగ్స్ రావు కదా అంటూ మాట్లాడారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది.

Advertisement

ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ ఈ మధ్యకాలంలో ఎన్ని సందర్భాలలో మనం కూతురిపై తండ్రి లైంగిక దాడి, అన్న వల్ల గర్భవతి అయిన చెల్లెలు అనే వార్తలు వినలేదు. అలాంటి ఫీలింగ్స్ రానప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటూ పరోక్షంగా ఈమె వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా కౌంటర్ ఇచ్చారు. బట్టలు విప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. అమ్మాయిలు మీరు ఇండిపెండెంట్ గా ఎదిగితేనే మీకు స్వతంత్రం వచ్చినట్టు కానీ బట్టలు విప్పుకొని తిరిగితే కాదు అంటూ ఈమె తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. ఇక చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారి పట్ల కూడా మాధురి మాట్లాడుతూ అలాంటి వారిని నా దృష్టిలో వెంటనే షూట్ చేసి చంపేయాలి, వారికి బ్రతికే హక్కు లేదని తెలిపారు. ఇలాంటి తప్పులకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడే చట్టం కూడా రావాలని ఈ సందర్భంగా మాధురి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: మాధురి సినిమాలలో నటించాలంటే దువ్వాడ కండిషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. భానుమతికి అనుమానం.. తల్లి కోసం ఎమోషనల్..

Big Stories

Advertisement
×