E-Paper
Advertisement

Steal OTT Release Date : సోఫీ టర్నర్ రాబరీ థ్రిల్లర్ ‘స్టీల్’… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Steal OTT Release Date : సోఫీ టర్నర్ రాబరీ థ్రిల్లర్ ‘స్టీల్’… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Steal OTT Release Date :  ఓటీటీలో ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ భాషలో వచ్చినా వీటిని అదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో త్వరలో ఒక ఉత్కంఠభరితమైన బ్రిటిష్ హీస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. దీని 2 నిమిషాల 20 సెకన్ల ట్రైలర్‌ ని చూస్తే దీనిని చూడకుండా అస్సలు ఆగలేరు మీరు. ఇందులో ఒక సాధారణ ఉద్యోగి జీవితం కొన్ని సెకన్లలో మారిపోతుంది. ఆమె కొన్ని వేల కోట్లను దొంగలకు అప్పజెప్పాల్సి వస్తుంది. ఈ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ఇది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ? ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది? 

ఆరు ఎపిసోడ్‌ల ఈ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘స్టీల్’ (Steal). ఇందులో సోఫీ టర్నర్‌, ల్యూక్‌గా ఆర్చీ మాడెక్వే, DCI రీస్‌గా జాకబ్ ఫార్చ్యూన్-లాయిడ్ నటించారు. సామ్ మిల్లర్, హెట్టీ మెక్‌డొనాల్డ్ దీనికి దర్శకత్వం వహించారు. గ్రెగ్ బ్రెన్‌మాన్, బెక్కీ డి సౌజా, సామ్ మిల్లర్, నువాలా ఓ’లియరీ, వివియన్ కెన్నీ దీనిని నిర్మించారు. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ను అందిస్తాయి. ఇది 2026 జనవరి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది.

Advertisement

Read Also  : విజయ్ సేతుపతి టాప్ మూవీస్… లిస్ట్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కూడా… ఏ మూవీని ఎక్కడ చూడవచ్చు అంటే ?

స్టోరీ ఏమిటంటే

జారా అనే మహిళ పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో ఉద్యోగినిగా పని చేస్తుంటుంది. ఆమె తన స్నేహితుడు ల్యూక్ తో కలిసి రోజూలాగే ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటుంది. అయితే ఒకరోజు ఆయుధాలు ధరించిన దొంగల ముఠా ఒక్కసారిగా ఆఫీసులోకి చొరబడి అందరినీ బందీలుగా చేసుకుంటారు. సామాన్య ప్రజల పెన్షన్ నిధులకు సంబంధించిన 4 బిలియన్ పౌండ్ల (సుమారు ₹44,000 కోట్లు) భారీ సొమ్మును దొంగిలించడానికి వాళ్ళు జారా, ల్యూక్‌లను పావులుగా వాడుకుంటారు. భయంకరమైన నేరస్తుల మధ్య ఇరుక్కున్న జారా, ల్యూక్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి వారు చెప్పినట్లు చేయాల్సి వస్తుంది. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో కనిపెట్టడానికి డిటెక్టివ్ రైస్ రంగంలోకి దిగుతాడు. మరి ఈ అతి పెద్ద కేసును రైస్ ఎలా హ్యాండిల్ చేశాడు ? దీని వెనుక ఎవరున్నారు ? ఆ డబ్బంతా ఏమైంది ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×