E-Paper
Advertisement

Spirit Release: స్పిరిట్ మార్చి 25 విడుదల వెనుక అదే కారణమా.. సందీప్ రెడ్డి ఫర్ ఫెక్ట్ ప్లానింగ్!

Spirit Release: స్పిరిట్ మార్చి 25 విడుదల వెనుక అదే కారణమా.. సందీప్ రెడ్డి ఫర్ ఫెక్ట్ ప్లానింగ్!
Advertisement

Spirit Release: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి (Sandeep Reddy)కేవలం రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈయన చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం సందీప్ రెడ్డి ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ (Spirit)సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని 2027లో విడుదల చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సందీప్ రెడ్డి ఈ వార్తలకు చెక్ పెట్టారు.

25 మార్చి 2027 న విడుదల..

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 మార్చి 25వ తేదీ విడుదల కాబోతుందని సందీప్ రెడ్డి అధికారికంగా తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏడాది సమయం ఉండగానే సందీప్ రెడ్డి ఇలా విడుదల తేదీని ఉన్నఫలంగా ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు .అయితే సందీప్ రెడ్డి మార్చ్ 25వ తేదీ విడుదల చేయడం వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. 2027 మార్చి 25వ తేదీ శుక్రవారం. 26వ తేదీ శనివారం మహాశివరాత్రి, 27వ తేదీ ఆదివారం. ఇలా ఈ సినిమా విడుదలైన రెండు రోజులు వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి.

వరుస సెలవులు కలిసొచ్చేనా..

Advertisement

ఒక సినిమా విడుదలైన తర్వాత వరుసగా సెలవులు వస్తే కచ్చితంగా సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపుతోందని థియేటర్ కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు కూడా తరలి వస్తారు. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వరుసగా సెలవులు వస్తున్న నేపథ్యంలో మార్చి 25వ తేదీ సినిమాని విడుదల చేయబోతున్నారని తెలిసిన అభిమానులు సందీప్ రెడ్డి మాస్టర్ ప్లానింగ్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులను ఏమాత్రం వెయిట్ చేయనీయకుండా, ముందస్తుకు సమాచారం లేకుండా వరుసగా అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఆకట్టుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

Advertisement

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ఆడియో టీజర్ విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా త్రిప్తి దిమ్రి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Champion OTT:  ఓటీటీలోకి రాబోతున్న ఛాంపియన్ ..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×