E-Paper
Advertisement

Stranger Things Season 5 Volume 3 OTT : 2026లో సై-ఫై హర్రర్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’కు ఎండ్ కార్డు… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?

Stranger Things Season 5 Volume 3 OTT : 2026లో సై-ఫై హర్రర్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’కు ఎండ్ కార్డు… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?
Advertisement

Stranger Things Season 5 Volume 3 OTT : మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఐదవ, చివరి సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు మేకర్స్ తాజా సీజన్ ఒక్కో పార్ట్ రిలీజ్ తో ఈ సిరీస్ అభిమానుల ఆకలిని తీరుస్తున్నారు. ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ వాల్యూమ్ 1 ఇప్పటికే రిలీజ్ కాగా, కాస్త గ్యాప్ ఇచ్చి అంటే ఒక నెల తర్వాత వాల్యూమ్ 2ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ‘వాల్యూమ్ 3’ కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి. మరి చివరి ఎపిసోడ్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి? ఎక్కడ చూడాలి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

వెక్నా, విల్, లెవెన్ వంటి ప్రధాన నటీనటులతో పాటు ఈ సిరీస్ కథ హాకిన్స్ చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ మొదటి, రెండవ వాల్యూమ్‌లు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్నాయి. వాల్యూమ్ 1 నవంబర్‌లో విడుదలైంది. వాల్యూమ్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. చివరి ఎపిసోడ్‌లో క్లైమాక్స్ ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ 3 కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక చివరి ఎపిసోడ్స్ ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా విడుదల అవుతుంది.

Advertisement

‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ చివరి ఎపిసోడ్ నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ కానుంది. డిసెంబర్ 31న యూఎస్ లో ఓటీటీలో అలాగే, కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. కానీ భారతదేశంలోని మాత్రం మరునాడు స్ట్రీమింగ్ అవుతుంది. అంటే నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 1న ఉదయం 6:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఎనిమిదవ ఎపిసోడ్ పేరు “ది రైట్‌సైట్ అప్”.

Read Also :  2025లో తోపు కలెక్షన్లు రాబట్టిన తమిళ సినిమాలు ఇవే… ఇందులో మీరెన్ని చూశారు ?

స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2 లో ఏం జరిగింది?

Advertisement

స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఏడవ ఎపిసోడ్‌లో విల్ తన జీవితంలోని బిగ్గెస్ట్ సీక్రెట్ ను బయట పెట్టాడు. వెక్నాను ఎదుర్కోవడానికి లెవెన్ తో పాటు అతని శక్తులు కూడా ఉపయోగిస్తాడు. మరోవైపు వెక్నా పిల్లలను ఎత్తుకెళ్ళి బంధించాడు. ప్రపంచాన్ని అంతం చేయడానికి అతను వేసిన ప్లాన్ ను భగ్నం చేయడానికి అందరూ ఏకమయ్యారు, మరి విల్, లెవెన్ వెక్నాను ఎలా ఎదుర్కొంటారో చివరి ఎపిసోడ్లో అంటే వాల్యూమ్ 3లో చూడాలి. మరికొన్ని గంటల్లోనే చివరి ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ షురూ కానుంది. ఇప్పటికైతే వాల్యూమ్ 2ని చూసి ఎంజాయ్ చేయండి.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×