E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో తోపు కలెక్షన్లు రాబట్టిన తమిళ సినిమాలు ఇవే… ఇందులో మీరెన్ని చూశారు ?

Year Ender 2025 : 2025లో తోపు కలెక్షన్లు రాబట్టిన తమిళ సినిమాలు ఇవే… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన సౌత్ సినిమాలు ఓటీటీలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఈ ఏడాది తమిళ సినిమాలు కూడా ప్రత్యేకతను చాటుకున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ల నుంచి ఫ్యామిలీ డ్రామాలు, ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే కామెడీ వరకు కోలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అయిన పలు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ హిట్స్ అన్పించుకున్నాయి. తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దుమ్మురేపాయి. మరి ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తమిళ సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కూలీ (Coolie)

రజనీకాంత్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’. 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 518 కోట్లు వసూలు చేసింది. హై ఆక్టెన్ యాక్షన్స్ సీన్స్ తో ఈ మూవీ ఈ సంవత్సరంలో అత్యుత్తమ తమిళ చిత్రంగా నిలిచింది. రజినీ అభిమానులను థియేటర్లలో ఈలలు వేయించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)

Advertisement

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 246.8 కోట్లు కొల్లగొట్టింది. సినిమాలో ఫన్ తో పాటు యాక్షన్ కూడా కావలసినంత ఉంది. కాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

డ్రాగన్ (Dragon)

డ్రాగన్ ఈ సంవత్సరం వచ్చిన తమిళ సర్ప్రైజింగ్ హిట్స్ లో ఒకటి. ఇందులో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీని నిర్మాణానికి పెద్దగా ఖర్చు కాలేదు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఏకంగా రూ. 154 కోట్లు కొల్లగొట్టి హిట్ అంటే ఎలా ఉంటుందో చూపించింది. ఈ మూవీని కూడా నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో మూవీ ‘డ్యూడ్’ కూడా 100 కోట్లు రాబట్టింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

కుబేరా (Kuberaa)

Advertisement

ధనుష్, రష్మిక మందన్న, నాగార్జున మెయిన్ లీడ్స్ గా నటించిన ‘కుబేరా’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది, ప్రపంచవ్యాప్తంగా రూ. 138.05 కోట్లు వసూలు చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

విదా ముయార్చి (Vidaamuyarchi)

అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 136.41 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 87 కోట్లకు పైగా వసూలు చేసిన ఫీల్-గుడ్ తమిళ ఫ్యామిలీ డ్రామా. ఈ ఏడాది తమిళంలో వచ్చిన మరిచిపోలేని సినిమాలలో ఇది కూడా ఒకటి. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ లిస్ట్ లో 97.35తో సూర్య ‘రెట్రో’, 99 కోట్లతో శివకార్తికేయన్ ‘మదరాసి’, 86 కోట్లతో విజయ్ సేతుపతి ‘తలైవన్ తలైవి’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

Read Also :  2026 జనవరిలో ఓటీటీలోకి రాబోతున్న మలయాళం సినిమాలు… ఏ ఓటీటీలో ఏ మూవీ అంటే ?

Tags

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×