E-Paper
Advertisement

Jatadhara OTT : ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు జటాధర..ఎక్కడ చూడొచ్చంటే!

Jatadhara OTT : ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు జటాధర..ఎక్కడ చూడొచ్చంటే!
Advertisement

Jatadhara OTT: ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లో విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్ నెలలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా నవంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక నేడు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే అయితే మరో టాలీవుడ్ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

సడన్ గా ఓటీటీలోకి వచ్చిన జటా ధర..

ఘట్టమనేని హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన నటుడు సుదీర్ బాబు ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “జటాధర”(Jatadhara). ఈ సినిమా నవంబర్ 7వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పౌరాణిక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షక ముందుకు వచ్చిన ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ దర్శకత్వం వహించగా, సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్,బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా కుమార్, రవికుమార్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు వంటి నటీనటులు ప్రధాన పాత్రలలో నటించారు.

తెలుగు హిందీ భాషలలో స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నప్పటికీ, విడుదలైన అనంతరం ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఇలా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా సడన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime video)లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ భాషలో కూడా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో మెప్పించ లేకపోయిన ఈ సినిమా ఇక్కడైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కథ విషయానికి వస్తే..

Advertisement

శివ(సుధీర్‌బాబు) ఓ ఘోస్ట్‌ హంటర్‌. దెయ్యాలను వెతికే అలవాటు అతనికి ఉంటుంది.దయ్యాలపై నమ్మకం లేకపోవడంతో దెయ్యాలను వెతికి అది ఒక భ్రమ అని నిరూపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఇక ప్రజలందరూ దయ్యాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని నమ్ముతారో అలాంటి ప్రదేశాలకు వెళ్లి దయ్యాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక శివకు ప్రతిరోజు ఒక కల వస్తుంది అందులో ఒక తల్లి తన బిడ్డను చంపుతున్నట్లు కల రావడంతో ఆ కల గురించి ఆరా తీస్తారు. చివరికి ఆ బిడ్డ తనే అని, తనని చంపుతున్నది తన తల్లి అని తెలుసుకుంటారు. తనను పెంచి పెద్ద చేసింది తన పెదనాన్న పెద్దమ్మలు అనే విషయాన్ని తెలుసుకున్న శివ తన తల్లితండ్రులను దుష్టశక్తి బలి తీసుకుందని తెలుసుకుంటాడు. మరి తన తల్లిదండ్రులను బలి తీసుకున్న దుష్టశక్తులను శివ ఎలా అంతం చేశాడు? వారి తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Balakrishna: నా దగ్గరకొస్తే తంతా.. నిర్మాతలపై బాలయ్య తీవ్ర ఆగ్రహం

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×