E-Paper
Advertisement

OTT Movie: షుగర్ ఫ్యాక్టరీలో చూడచక్కని దయ్యాలు… రాత్రయితే చాలు వణికిపోయే కార్మికులు

OTT Movie: షుగర్ ఫ్యాక్టరీలో చూడచక్కని దయ్యాలు… రాత్రయితే చాలు వణికిపోయే కార్మికులు
Advertisement

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి వచ్చే సినిమాలలో పూర్తిగా హారర్ కంటెంట్ ఉంటుంది. అక్కడి వాళ్ళు ఎక్కువగా చేతబడులు, ఆత్మలను నమ్ముతుంటారు. ఈ సినిమాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. రీసెంట్ గా ఒక హారర్ మూవీ థియేటర్లలో ఆడియన్స్ ని భయపెట్టి, ఓటీటీలోకి వచ్చింది. ఈ కథ ఒక చక్కెర ఫ్యాక్టరీలో నడుస్తుంది. అక్కడ ఒక దెయ్యాల రాజ్యమే ఉంటుంది. కొత్తగా పనిలోకి నలుగురు వ్యక్తులు వెళ్లడంతో స్టోరీ భయంకరమైన మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఏడాది అవి సూర్యాది డైరెక్షన్ లో వచ్చిన ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు ‘షుగర్ మిల్’ (Sugar Mill). ఇందులో అర్బనీ యాసిజ్ (రామా), ఎర్స్యా ఔరెలియా (సురా), ఎరికా కార్లినా (లిండా), బుకీ బి. మాన్స్యూర్ (జావా) లీడ్ రోల్స్ లో నటించారు. 133 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.8/10 రేటింగ్ పొందింది. ఎస్‌టి స్టూడియోస్ ప్రొడక్షన్ లో రూపొందింన ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : దేవుడి విగ్రహాలపై రాక్షసుడి కన్ను… శాపంతో శవాలుగా మారే ఊరి జనం… గుండె ఝల్లుమనిపించే సినిమా

స్టోరీ ఏమిటంటే

ఇండోనేషియాలోని పాత చక్కెర ఫ్యాక్టరీలో రామా, సురా, లిండా, జావా అనే నలుగురు యంగ్ వర్కర్స్ సీజన్ జాబ్ చేయడానికి వస్తారు. అక్కడ మేనేజర్ వీళ్ళకి ఒక రూల్ పెడతాడు. సూర్యాస్తమయం తర్వాత ఎవరూ లోపల ఉండకూడదు, లేకపోతే డెమన్ కి బలవుతారని వార్నింగ్ ఇస్తాడు. మొదట్లో వీళ్ళు అతను చెప్పిందంతా జోక్ అనుకుంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత ఫ్యాక్టరీలో ఉంటే, డచ్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం బానిసలను టార్చర్ చేసి చంపేసిన ఆత్మలు లేచి వస్తాయి. వీళ్లందరూ ఒక్కసారిగా వణికి పోతారు. మొదట లిండాకి దెయ్యం పట్టుకుని టార్చర్ చేస్తుంది. ఆమె తనకు తానే గొంతు కోసుకుని చస్తుంది. జావా కూడా తనకు తానే హింసించుకుని చనిపోతాడు. ఫ్యాక్టరీ రక్తంతో భయంకరంగా మారుతుంది.

Advertisement

చేతులు లేని దెయ్యాలు, గొలుసుల శబ్దాలతో ఫ్యాక్టరీ మొత్తం నరకంగా మారుతుంది. ఇక రామా సురా ఇద్దరే మిగులుతారు. ఈ సమయంలో వీలకి ఆ దెయ్యాల ఫ్లాష్‌ బ్యాక్‌లో తెలుస్తుంది. 1800ల్లో ఒక డచ్ అధికారి బానిసల్ని బాయిలర్‌లో ప్రాణాలతో పడేసేవాడు. ఆ ఆత్మలు ఇప్పుడు ఫ్యాక్టరీలో రాత్రిపూట ఎవరైనా కనబడితే నరకం చూపిస్తుంటాయి. చివరికి సురాలో దెయ్యం చేరుతుంది. రామాని చంపేయాలని వస్తుంది. అయితే రామా ఆమెనే బాయిలర్‌లో తోసేసి ఒక్కడే గేట్ దగ్గరకు చేరుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి రామా బతుకుతాడా ? ఈ దెయ్యాలకు బలవుతాడా ? అనే విషయాలను, ఈ ఇండొనేషియన్ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×