E-Paper
Advertisement

Guntur News: లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్, చివరకు?

Guntur News: లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్, చివరకు?
Advertisement

Guntur News: గుంటూరు జిల్లా నడింపాలెం వద్ద ఉన్న కాటూరి మెడికల్ కాలేజీలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది. మహిళా డాక్టర్లు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా వారి నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్న ఒక కాంపౌండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజుల క్రితం విధుల్లో చేరిన సాయి అనే కాంపౌండర్ ఈ నీచ కార్యానికి పాల్పడ్డాడు. ఓపీ థియేటర్ దగ్గర ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌ను ఇతను ఉపయోగించుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది. కాలేజీ యాజమాన్యం మొదట్లో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఘటన తీవ్రత వల్ల బయటకు వచ్చింది.

ఈ సంఘటన ఈ నెల 24వ తేదీన జరిగింది. ఓ మహిళా డాక్టర్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో.. పక్క గది గోడ పై నుంచి కాంపౌండర్ సాయి మొబైల్‌తో వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో సడెన్‌గా మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ అయింది. ఫ్లాష్ లైట్ వెలుగు గమనించిన మహిళా డాక్టర్ వెంటనే అప్రమత్తమై పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని అప్రమత్తమైన ఇతర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు సాయిని పట్టుకున్నారు. అతని మొబైల్‌ను లాక్కున్నారు. అనంతరం కాలేజీ యాజమాన్యం ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, కాంపౌండర్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఈ దారుణ చర్యకు పాల్పడిన సాయి మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ విచారణ కోసం మొబైల్‌ను ల్యాబ్‌కు పంపారు. పోలీసులు ప్రాథమికంగా మొబైల్‌లో కేవలం రెండు వీడియోలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.

అయితే.. మహిళా వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ డేటా రీట్రైవ్ అయిన తర్వాత మరింత కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. అంటే, ఎక్కువ వీడియోలు దొరికే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. ఈ సంఘటన కాలేజీలో కలకలం రేపింది. ఒక కాంపౌండర్ ఇలాంటి పని చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా డాక్టర్ల గోప్యతకు భంగం కలిగించిన ఈ కేసులో పూర్తి విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కాటూరి మెడికల్ కాలేజీ యాజమాన్యం మొదట్లో ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలని ప్రయత్నించడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ ఘటన కాలేజీ వాతావరణాన్ని.. మహిళా డాక్టర్ల భద్రత అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది.

Advertisement

ALSO READ: Sarpanch Elections: ఆ విలేజ్‌లో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్.. ఎకగ్రీవంగా ఎన్నిక, గెలుపు సంబరాల్లో గ్రామస్థులు

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×