E-Paper
Advertisement

Sumathi Sathakam OTT : పెళ్లి కొడుకుకు ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు … ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ మూవీ

Sumathi Sathakam OTT : పెళ్లి కొడుకుకు ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు … ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ మూవీ
Advertisement

Sumathi Sathakam OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిలో పడ్డాడు అమర్‌దీప్ చౌదరి. అయితే ఇప్పుడు అతను హీరో అవతారం ఎత్తిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అతని మొదటి సారి హీరోగా నటించిన ‘సుమతి శతకం’ (Sumathi Sathakam) థియేటర్లలో 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రమోషన్ లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణ పొందలేదు. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ రంగంలో అడుగు పెట్టబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నామమాత్ర ధరకు ఓ ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకుంది. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఎమ్.ఎల్.నాయుడు దర్శకత్వం వహించిన  ‘సుమతి శతకం’ (Sumathi Sathakam) చిత్రంలో అమర్‌దీప్ చౌదరి హీరోగా మొదటిసారి ప్రధాన పాత్ర పోషించాడు. మహేష్ విట్టా, టేస్టీ తేజ, బ్రహ్మాజీ వంటి నటీనటులు సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. ఈ సినిమా ETV Winలో 2026 మార్చి 19 నుంచి ప్రీమియర్ అవుతుంది. అదే సమయంలో OTTplay ప్రీమియంలో కూడా స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో ప్రమోషన్ లేకపోవడంతో చాలా మంది మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు ETV Winలో మార్చి 19 నుంచి ప్రీమియర్ అవుతుంది కాబట్టి ఓటీటీ ప్రేక్షకులకు మంచి అవకాశం. ఇటీవల ‘శ్రీ చిదంబరం గారు’ వంటి సినిమాలు థియేటర్ ఫెయిల్ తర్వాత ఓటీటీలో బాగా రన్ అయ్యాయి. ‘సుమతి శతకం’ సినిమా  కూడా అలాగే రన్ అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రేమకథలు, ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను మిస్ చేయకండి.

గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథ..

Advertisement

ఒక చిన్న గ్రామానికి చెందిన సాధారణ యువకుడి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి ఏకైక కల ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం. ప్రశాంతమైన జీవితం గడపడం. ఊరిలో ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉండటంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. అయితే అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్‌ సుమతి(శైలి చౌదరి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమలో పడిన తర్వాత ఊహించని మలుపులు, సమస్యలు అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి. సినిమా సెకండాఫ్‌లో ఊరి పెద్దలు, హీరో మధ్య వచ్చే సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పక్కా లోకల్ కామెడీ, పల్లెటూరి యాస, అమర్‌దీప్ యాక్టింగ్ ఈ కథకు మెయిన్ ప్లస్ పాయింట్స్. ఇక సుమతీ కూడా అతనికి ఒక కండిషన్ పెడుతుంది. దీంతో కథ మలుపు తీసుకుంటుంది.  చివరికి సుమతీ, కృష్ణల ప్రేమ ఏమవుతుంది ? వీళ్ళ ప్రేమకు వచ్చిన సమస్య ఏమిటి ? సుమతీ పెట్టిన కండిషన్ ఏమిటి ? అసలు కృష్ణకి ఆమెతో పెళ్లి జరుగుతుందా ? అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి… ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×